రాగి పిండి - అరకిలో
సెనగపప్పు - 100 గ్రా.
జీలకర్ర - 25 గ్రా.
పచ్చిమిరపకాయలు - 30 గ్రా.
ఉల్లిపాయలు - 200 గ్రా.
వంట సోడా - అరటీస్పూన్
కరివేపాకు - కొంచెం
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- మొదట ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి రాగి పిండి తీసుకోవాలి.
- అందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, సెనగపప్పు, జీలకర్ర, వంట సోడా, కరివేపాకు, (కావాలనుకుంటే కొంచెం మునుగాకు కూడా వేసుకోవచ్చు) తగినంత ఉప్పు, నీళ్ళు పోసి చపాతీ పిండిలా చేసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడ నూనె పోసుకొని, అది బాగా కాగాక రాగి పిండి మిశ్రమాన్ని వడలా చేతితో కావలసిన ఆకారంలో తట్టి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే నోరూరించే రాగి వడలు రెడీ. ఇవి రుచిగా ఉండడమే కాక ఆరోగ్యానికి చాలా మంచిది.
మూలం : సాక్షి దినపత్రిక