మినప్పప్పు - 300 గ్రా.
బియ్యం - 2 టేబుల్ స్పూన్లు
క్యారెట్ - 100 గ్రా.
బీన్స్ - 100 గ్రా.
పచ్చి బఠానీ - 100 గ్రా.
ఉల్లిపాయలు - 5 (పెద్దవి)
పచ్చిమిరపకాయలు - 3
డాల్డా - 1 స్పూన్
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర - కొంచెం
కరివేపాకు - కొంచెం
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- ముందుగా మినప్పప్పులో బియ్యం కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టాలి. మరోవైపు క్యారెట్, బీన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన మినప్పప్పును గ్రైండర్ లో వేసి రెండు నిముషాలు రుబ్బాలి. తర్వాత పచ్చిమిరపకాయలను, అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి వడలకు కలిపే పిండిలా కలుపుకోవాలి. రుబ్బిన పిండిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను, పచ్చి బఠానీలను, డాల్డాను వేసి బాగా కలపాలి.
- అనంతరం స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి.
- నూనె బాగా కాగిన తర్వాత కూరగాయలు చేర్చిన మినప్పప్పు పిండిని వడలాగా తట్టి కాగుతున్న నూనెలో వేసి బాగా వేయించాలి. ఇంకేముంది నోరూరించే వెజ్ వడలు రెడీ. వీటిని పచ్చి కొబ్బరి చట్నీతో గాని, ఎండు మిరపకాయ చట్నీతో గాని తినవచ్చు.
మూలం : సాక్షి దినపత్రిక