అటుకులు - ఒక కప్పు
టమోటాలు - 50 గ్రా.
ఉల్లిపాయ - ఒకటి (పెద్దది)
ఎండుమిరపకాయలు - రెండు
అల్లం - చిన్న ముక్క
నూనె - 50 గ్రా.
ఆవాలు - అరటీస్పూన్
జీలకర్ర - అరటీస్పూన్
మినప్పప్పు - ఒక టీస్పూన్
కరివేపాకు - కొంచెం
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- మొదట ఉల్లిపాయను, టొమాటను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
- తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు,(ఇష్టమైతే వేరుసెనగ పల్లీలు కూడా వేసుకోవచ్చు) ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం అల్లం, టమాటో ముక్కలు వేసి మూడు నిముషాలు వేగనివ్వాలి. రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పు చేర్చి మూతపెట్టి మరిగించుకోవాలి. బాగా తెర్లిన తర్వాత అందులో అటుకులు వేసుకోవాలి. చివరగా చిటికెడు పసుపు చేర్చి మూడు నిముషాలు ఉడికించాలి. అంతే రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.
మూలం : సాక్షి దినపత్రిక