సొరకాయ తురుము - ఒక కప్పు,
గోధుమపిండి - ఒక కప్పు,
పచ్చిమిర్చి (సన్నగా తరిగి)- ఒకటి,
ఉప్పు -ముప్పావు స్పూన్,
నూనె -ఒక టీస్పూన్,
కొత్తిమీర తురుము - ఒక టేబుల్ స్పూన్,
కసూరి మెంతి - ఒక టేబుల్‌స్పూన్,
కారం - పావు టీస్పూన్,
పసుపు - రెండు చిటికెలు,
చాట్ మసాలా - పావు టీస్పూన్,
గోధుమ పిండి - మూడు టేబుల్ స్పూన్‌లు,
నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్‌స్పూన్‌లు (తెప్లా పైన పూసేందుకు)
తయారుచేసే పద్ధతి :
- గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరిమెంతి, కారం, పసుపు, చాట్ మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి. సొరకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్లు పోయనక్కర్లేదు. ఒకవేళ పిండి మరీ జారుగా అయితే మరికొంచెం గోధుమపిండి కలపండి. మెత్తటి ముద్ద తయారుచేసుకున్న తరువాత దాన్నుంచి పది చిన్న చిన్న ఉండలు చేయాలి.
- ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడి చేయాలి. అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి. వీటిని వేడెక్కిన పెనం మీద వేసి ఎర్రటి మచ్చలు వచ్చే వరకు కాల్చాలి. ఆ తరువాత రెండో వైపు తిప్పి పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి. ఇలానే రెండో వైపు కూడా చేయాలి. రెడీ అయిన తెప్లాలను మీకు నచ్చిన కూర లేదా పచ్చడితో తినొచ్చు. ప్రయాణాల్లో వీటిని వేడివేడి టీతో కలిపి తిన్నా బాగుంటాయి.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక