
సేమియా 1 కప్పు
పనీర్ ముక్కలు 3 చెంచాలు
క్యారెట్, బీన్స్, క్యాబేజీ ముక్కలు పావు కప్పు
ఉప్పు తగినంత
నూనె రెండు చెంచాలు,
గరం మసాలా అరచెంచా
కొత్తిమీర 1 కట్ట
తయారు చేసే విధానం :
ముందుగా గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని సేమియా వేసి ఉడకనివ్వాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి సేమియాను ఓ ప్లేట్‌లోకి తీసుకుని ఆరనివ్వాలి. బాణలిలో నూనె వేడి చేసి క్యారెట్, బీన్స్, క్యాబేజీ ముక్కలు వేయించాలి. 5 నిమిషా లయ్యాక పనీర్ ముక్కలు కలిపి తగినంత ఉప్పు, గరంమసాలా చల్లి, చివరగా సేమియా వేసి బాగా కలపాలి. 5 నిమిషాలయ్యాక కొత్తిమీర తురుమును చల్లి దించేయాలి. అంతే నోరూరించే సేమియా పనీర్ బాత్ రెడీ!