
బీరకాయ (ముక్కలు తరిగి) - ఒకటి,
శెనగపిండి - ఒక కప్పు,
బియ్యప్పిండి - పావుకప్పు,
కారం - ఒక టీస్పూన్,
వంటసోడా- చిటికెడు,
మిరియాలపొడి, సోయాసాస్ - ఒక్కో స్పూన్,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - వేగించడానికి తగినంత.
తయారీ:
బీరకాయల్ని కడిగి చెక్కు తీసి సన్నగా గుండ్రంగా కోయాలి. ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్ధాలన్నింటిని వేసి సరిపడా నీళ్లు పోసి దోసెపిండిలా కలుపుకోవాలి. కళాయిలో నూనె వేడిచేయాలి. శెనగపిండి మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌తో తింటే టేస్టీగా ఉంటాయి.