గోధుమలు - ఒకటిన్నర కప్పులు,
మినప్పప్పు - ముప్పావు కప్పు,
బఠాణీ - పావు కప్పు,
క్యారట్ తురుము - పావు కప్పు,
బీన్స్ తరుగు - పావు కప్పు,
పెరుగు - అర కప్పు,
కొత్తిమీర - కొద్దిగా,
కరివేపాకు - రెండు రెమ్మలు,
ఆవాలు - టీ స్పూను,
మినప్పప్పు (బద్దలు) - 2 టీ స్పూన్లు,
శనగపప్పు - 2 టీ స్పూన్లు,
అల్లం - చిన్న ముక్క,
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,
ఉప్పు - తగినంత,
నూనె - తగినంత
తయారి:
- గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి
- మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి
- గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి
- మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి
- బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి
- క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి
- నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి
- ఇడ్లీ రేకులలో వేసి కుకర్లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి.