బియ్యప్పిండి -50 గ్రా.,
కారం - టీ స్పూను,
చాట్‌మసాలా - అర టీ స్పూను,
సేవ్ - పావు కప్పు,
క్యారట్ తురుము - 3 టీ స్పూన్లు,
ఉల్లితరుగు - అర కప్పు,
పెరుగు - అర కప్పు,
కొత్తిమీర - కొద్దిగా,
ఉప్పు -తగినంత
తయారి:
- ఒక పాత్రలో బియ్యప్పిండి, అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి
- కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి
- వీటిని ఆవిరి మీద ఉడికించి, బయటకు తీసి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచాలి
- ఉల్లితరుగు, క్యారట్ తురుము, కారం, చాట్ మసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి
- చివరగా సేవ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.