చిలగడదుంపలు - ఒక కప్పు (ఉడికించి, మెదిపి),
గోధుమపిండి - రెండు కప్పులు,
నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్,
ఉప్పు- రుచికి సరిపడా,
నూనె - వేగించడానికి సరిపడా.
కారపు ముద్ద:
పచ్చిమిర్చి - నాలుగు,
అల్లం - చిన్న ముక్క,
కొత్తిమీర, పుదీనా - కొద్దిగా.
పొడి మసాలా:
ధనియాలు- జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు,
ఆమ్‌చూర్ పొడి- ఒక టీస్పూన్,
గరం మసాలా - అర టీస్పూన్.
తయారీ:
గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టి ముద్దలా కలపాలి. మెదిపిన చిలగడదుంపల్లో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా, ధనియాలు-జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలాలతో పాటు నిమ్మరసం, ఉప్పు వేసి మెత్తటి ముద్దలా కలపాలి. ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. ముందు కలిపి పెట్టిన పిండి ముద్ద నుంచి కొంచెం పిండిని తీసుకుని, నూనె చేతులకి రాసుకుని కప్పు ఆకారంలో చేయాలి. ఇందులో చిలగడదుంప ఉండని ఉంచి కప్పుని మూసేసి చదునుగా చేసి పరాఠాలా ఒత్తాలి. తరువాత పెనం మీద వేసి ఓ మాదిరిమంట మీద రెండువైపులా కాల్చాలి. తరువాత వాటికి నెయ్యి పూసి మంట పెంచి ముదురు రంగు వచ్చే వరకు వేగించాలి. ఈ పరాఠాల్ని వేడివేడిగా నచ్చిన చట్నీతో లాగించొచ్చు.