వంకాయలు - 250 గ్రా.
టమోటాలు - 100 గ్రా.
ఉల్లిపాయ - ఒకటి (పెద్దది)
నూనె - 100 గ్రా.
కారం పొడి - 2 స్పూన్లు
పసుపు, పోపు గింజలు - 1 టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- ముందుగా వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయను ముక్కలు చేసి పెట్ట్టుకోవాలి.
- బాణలిలో నూనె వేసి, కాగిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని, పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరగా కారం పొడి, పసుపు వేసి మూడు నిముషాలు వేయించుకోవాలి. అంతే వంకాయ తొక్కు రెడీ. దీన్ని అన్నంలో నెయ్యి వేసుకొని ఆరగిస్తే భలే రుచిగా ఉంటుంది. ఈ విధముగా చేసే తొక్కు రెండు, మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది.
మూలం : సాక్షి దినపత్రిక