telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

పన్నీర్ క్యాప్సికం మసాలా

1/24/2014

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్ - 30(గా., 
గ్రీన్ క్యాప్సికం - 1,
 రెడ్ క్యాప్సికం - 1,
 యెల్లో క్యాప్సికం - 1, 
జీడిపప్పు -10, 
అల్లం - చిన్న ముక్క, 
టమాటా ప్యూరీ - ఒక కప్పు,
 జీలకర్ర - ఒక టీ స్పూన్, 
కారం - ఒక టీ స్పూన్, 
పసుపు - అర టీ స్పూన్, 
ధనియాల పొడి - ఒక టీ స్పూన్, 
గరం మసాలా పౌడర్ - అర టీ స్పూన్, 
నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
  • పన్నీర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 
  • పెనం పెట్టి నూనె లేకుండా పన్నీర్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఈ ముక్కలను ఉప్పు వేసి వేడి నీటిలో 15నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు మెత్తగా అవుతాయి. 
  • మూడు రంగుల క్యాప్సికాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 
  • ఇప్పుడు కడాయిలో నూనె పోసి జీలకర్ర, అల్లం, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. దీంట్లో టమాటా ప్యూరీ వేసి సన్నని మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 
  • కొన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి పదినిమిషాలు అలాగే ఉంచాలి. దీంట్లో పన్నీరు ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కలిపి మూత పెట్టేయాలి. 
  • మరో ఐదు నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. చివరగా జీడిపప్పులను వేసి దించేయాలి. 

0 Comments

ఆలూ, సోయా వేపుడు

1/3/2014

0 Comments

 
Picture
కావలసినవి
బంగాళాదుంపలు - 250 గ్రా.
సోయా కూర - 1 కట్ట
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 1 రెబ్బ
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.

వండే విధం
బంగాళాదుంపలను చెక్కు తీసి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
సోయా కూర కూడా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, పసుపు, సోయాకూర వేసి కొద్దిగా కలిపి బంగాళా దుంప ముక్కలు వేసి కలిపి వేయించాలి.
ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించి వేయించాలి.
ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలు, పూరీలకు బావుంటుంది.


0 Comments

బీన్స్, మీల్ మేకర్ కూర

12/21/2013

0 Comments

 
Picture
కావలసినవి
బీన్స్ - 200 గ్రా.
మీల్‌మేకర్ - 50 గ్రా.
జీలకర్ర - 1 టీ.స్పూ.
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
పంచదార -1/2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
ఎండుమిర్చి - 2
ఉల్లిపాయ - 1 చిన్నది
వెల్లుల్లి - 4 రెబ్బలు
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - 2 టీ.స్పూ.

ఇలా వండాలి
  • ఒక గినె్నలో మూడు గ్లాసుల నీళ్లు మరిగించి మీల్ మేకర్ వేసి దింపేయాలి. చల్లారిన తర్వాత నీరంతా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. 
  • బీన్స్ నార తీసి ఒకటి లేదా రెండు అంగుళాల సైజులో కట్ చేసుకోవాలి. 
  • పాన్‌లో నూనె వేడి చేసి ఎండుమిర్చితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో నలక్కొట్టి సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం పొడి వేసి కలిపి మీల్‌మేకర్ వేయాలి. 
  • వీటిని కొద్దిసేపు వేయించాక బీన్స్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. బీన్స్ ముందే సగం ఉడికించి పెట్టుకోవచ్చు. 
  • బీన్స్ వేగిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. నీరు పూర్తిగా ఇగిరిపోయిన తర్వాత దింపేయాలి. ఇష్టముంటే టమాటాలు, కొబ్బరిపొడి వేసి కుర్మాలా కూడా చేసుకోవచ్చు.



0 Comments

ఫ్రైడ్ టోపూ

12/18/2013

0 Comments

 
Picture
కావలసినవి
టోఫూ ముక్కలు - 250 గ్రా.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
పంచదార - చిటికెడు
ఉప్పు - తగినంత
మైదా - 1 టీ.స్పూ.
సోయా సాస్ - 1/2 టీస్పూ.
నిమ్మరసం - 1 టీ.స్పూ.
కలర్ - చిటికెడు
కరివేపాకు - 3 రెబ్బలు
నూనె - వేయించడానికి

వండే విధం
  • టోఫూని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 
  • ఆతర్వాత ఒక గినె్నలో మైదా, పంచదార, సోయా సాస్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కలర్ వేసి కలపాలి.
  •  ఇందులో టోఫూ ముక్కలు వేసి, బాగా కలిపి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. 
  • కరివేపాకు కూడా అదే నూనెలో వేయించుకుని ఈ టోఫూతో పాటు వేడిగా సర్వ్ చేయాలి.



0 Comments

మలై పన్నీర్

11/25/2013

0 Comments

 
Picture
కావలసినవి
పన్నీర్‌ ముక్కలు-అరకేజి,

ఉల్లిపాయలు-2,
టమాట-2,

గరంమసాలా-ఒక చెంచా
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-రెండు చెంచాలు
కారం-ఒక చెంచా,

ధనియాలపొడి-ఒకచెంచా
పసుపు-పావు చెంచా
ఉప్పు-రుచికి తగినంత
మీగడ-అరకప్పు
నూనె-పావు చెంచా


తయారుచేసే విధానం
  • ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వేగిన ఉల్లిపాయల్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాల పాటు వేయించాలి.
  • తరువాత పన్నీర్‌ ముక్కలు వేసి మసాలా వాటిని బాగా పట్టేవరకు వేయించాలి. చివరగా మీగడ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి కలియబెట్టి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసి వేడిగా వడ్డించాలి. అంతే మలైపన్నీర్‌ రెడీ.

మూలం : వార్త దినపత్రిక


0 Comments

ఉసిరికాయ పప్పు

11/22/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కందిపప్పు - ఒక కప్పు,
 టమాటాలు - 4, 
ఉల్లిగడ్డ - 1, 
ఉసిరికాయలు - 10, 
కారం - ఒక టీ స్పూన్,
 పసుపు - కొద్దిగా
శనగపప్పు - ఒక టీ స్పూన్ , 
మినపప్పు - ఒక టీ స్పూన్, 
ఆవాలు - అర టీ స్పూన్, 
జీలకర్ర - అర టీ స్పూన్, 
వెల్లుల్లిపాయలు - 3, 
ఎండు మిరపకాయలు - 2, 
కరివేపాకు - 2 రెమ్మలు, 
ఉప్పు, నూనె - తగినంత 

తయారు చేసే విధానం : 
ఉసిరికాయలను గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
టమాటాలను పెద్ద ముక్కలుగా, ఉల్లిపాయలను మామూలు సైజ్‌ల్లో కట్ చేయాలి. 
కుక్కర్‌లో కందిపప్పు, ఉసిరికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. మెత్తగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాస్త ఉప్పువేసి పప్పు సుద్దతో బాగా మెదపాలి.
ఇప్పుడు కడాయిలో నూనె పోసి.. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి పోపు చేయాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసి కలపాలి. ఉసిరికాయ పప్పును వేడి అన్నంతో కలిపి ఆరగించేయొచ్చు.

0 Comments

వెజ్ హలీం

11/17/2013

0 Comments

 
Picture
కావలసిన వస్తువులు
గోదుమ రవ్వ : 3/4 కప్పు,
మైసూర్‌ పప్పు : 1/2 కప్పు,
పెసర పప్పు : 1/2 కప్పు,
శనగపప్పు : 1/2 కప్పు,
సోయా గింజలు : 1/2 కప్పు,
నూనె : 2 చెంచాలు,
ఏలకులు : 4,
దాల్చిన చెక్క : 4 ముక్కలు,
లవంగాలు : 4,
సాజీరా : 1/2 కప్పు,
వెల్లుల్లి పేస్ట్‌ : రెండు చెంచాలు,
అల్లం పేస్ట్‌ : రెండు చెంచాలు,
ఉల్లిపాయల పేస్ట్‌ : 1/2 కప్పు,
కారం : స్పూన్‌,
దనియాల పొడి : రెండు చెంచాలు,
పచ్చి బటానీల పేస్ట్‌ : చెంచా,
ఉప్పు : తగినంత.

తయారు చేయువిధానం
గోదుమ రవ్వను ఓ గంట పాటు నీటిలో నానబెట్టండి. తరువాత నీరు ఒంపి నాలుగు కప్పుల మంచినీరు పోయండి. పప్పులన్నీ వేసి కుక్కర్‌లో అర గంట ఉడికించండి. వేడినీటిలో సోయా గింజలను 20 నిమిషాలు నానబెట్టాలి. నీటిని తీసివేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్‌ పోసి వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. తరువాత ఉల్లిపాయల పేస్ట్‌ కూడా వేసి కలయబెట్టాలి. ఇప్పుడు కారం, దనియాల పొడి, పచ్చి బఠానీలు వేయాలి. ఇప్పుడు ముందు ఉడికించి పెట్టుకున్న గోదుమ రవ్వ, పప్పుల మిశ్రమాన్ని కలపాలి. దీనిలో సోయా గింజలను వేయాలి. కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. రుచికి సరిపోయేంత ఉప్పు కలిపి 5 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. ఇక వేడి వేడి వెజిటబుల్‌ హలీమ్‌ రెడీ...


0 Comments

భేండీ మసాలా

11/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బెండకాయలు - కిలో
ఉల్లిగడ్డలు - 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -
ఒక స్పూన్
ధనియాల పొడి -
ఒక స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ - ఒక టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత

తయారు చేసే విధానం :
బెండకాయలను మంచిగా కడిగి పెద్ద, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనెపోసి జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపేస్టూ కలపాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేగనిచ్చి బెండకాయ ముక్కలను వేయాలి. సన్నని మంట మీద ఒక పావు గంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో ముందుగా పసుపు, కారం వేసి కాసేపు కలపాలి. ఆ పై గరం మసాలా పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోవాలి. వేడి.. వేడి.. భేండీ మసాలా మీ ముందుంటుంది. ఈ కూర చపాతీల్లోకి చాలా బాగుంటుంది.


0 Comments

వంకాయ మసాలా

11/13/2013

0 Comments

 
Picture
కావాల్సిన పదార్థాలు :
8 చిన్న వంకాయలు
రుచికి తగినంత ఉప్పు
1 స్పూన్ కారం
1 స్పూన్ పసుపు
1 స్పూన్ గరమ్ మసాలా
2 స్పూన్ల ధనియాల పొడి
2 స్పూన్ల ఎండు మామిడి పొడి
1 స్పూన్ సోంప్, 1 స్పూన్ శనగపిండి

తయారు చేసే విధానం:
వంకాయలను కడిగి తడి లేకుండా కడిగి ఆరబెట్టాలి. వంకాయలను నాలుగు చీలికలుగా గుత్తిగా తరగాలి. పైన చెప్పిన దినుసులను కలిపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లోకి జాగ్రత్తగా కూరాలి. ఒక బాణలిలో నూనె వేసి కాగిన తరవాత ఒక్కో వంకాయను జాగ్రత్తగా బాణలిలో వేయాలి. మూతపెట్టి సన్నని మంటపై ఉడకనివ్వాలి. వంకాయలు అడుగు అంటకుండా మధ్యలో కదుపుతూ ఉండాలి. 20 నిమిషాలలో కూర తయారై పోతుంది
 



0 Comments

మొక్కజొన్నకుర్మా

11/11/2013

0 Comments

 
Picture
కావలసినవి
బేబీకార్న్‌-8కండెలు,

నూనె-పావుకప్పు
ఉల్లిపాయలు-రెండు,

టమాటాలు-మూడు
పెరుగు-ఒక కప్పు,

ఉప్పు, కారం-తగినంత
చక్కెర-చిటికెడు,

పసుపు-అరచెంచా,
పచ్చిమిర్చి-మూడు
మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,
కొత్తిమీర-రెండు రెమ్మలు


తయారుచేసే విధానం
బేబీకార్న్‌ కండెల్ని పొడవుగా చీల్చాలి. రెండు కూతలు వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి.
తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడెక్కాక దానిలో ఉల్లి,పచ్చిమిర్చి. టమాటా తరుగు వేసి మగ్గించాలి.
తర్వాత ఉడికించిన కార్న్‌ ముక్కలు పసుపు, కారం, ఉప్పు, చక్కెర వేసి మూతపెట్టాలి. 5నిమిషాల తరువాత దానిలో కప్పునీరు, పావుకప్పు పెరుగు వేయాలి. ఈలోగా మొక్కజొన్న పిండికి రెండు చెంచాల నీళ్లు కలపాలి. దానిని కూడా బాణలిలో వేయాలి. కొద్దిసేపు ఉడికేటప్పటికి గ్రేవీ తయా రవుతుంది. దించే ముందు కొత్తిమీర ముక్కలు చేసి జల్లాలి. ఇక మొక్కజొన్న కుర్మా సిద్ధమైనట్లే.


0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    కంద
    ఆలూ గోబీ
    ఆలూ గోభీ
    మలై మటర్ పనీర్
    ఆలూ సోయా వేపుడు
    కడై పనీర్
    దహీ భేండీ
    ఆలూ కుర్మా
    మలై పన్నీర్
    ఆలు అమృత్‌సరి
    మలై కాలీఫ్లవర్
    సోయా
    బెండ
    సోయా - టొమాటో కర్రీ
    మునగ కూర
    దాల్ మఖని
    వెజ్ హలీం
    కుర్ కురీ భేండీ
    ములగ ఆకులు
    పాలక పనీర్
    గోడా మసాలా తయారీ
    టమాట పన్నీర్ కూర
    వంకాయ
    వంకాయ - చిక్కుడుగింజల కూర
    బెండి కా సాలన్
    సింధి కడి
    భేండీ భాజీ
    టమాటా బాజీ
    భేండీ మసాలా
    వంకాయ మసాలా
    బేసన్ బెండి
    టమాటా కుర్మా
    వంకాయ తొక్కు
    మటర్‌ పనీర్‌ కూర
    అచార్ పన్నీర్
    బఠానీ మష్రూమ్స్
    పాలక్ మీల్‌మేకర్
    బీరకాయ
    సొరకాయ
    పాఠోళి
    టొమాటో - ఎగ్ కర్రీ
    మిక్స్ డ్ వెజ్ కోకోనట్ కర్రీ
    మిర్చి కా సాలన్
    దోసకాయ కూర
    సుక్కి దాల్
    ఫ్రైడ్ టోపూ
    రాజ్మా రాస్ మిస్
    గ్రీన్ పీస్ మసాలా
    బీన్స్ మీల్ మేకర్ కూర
    రాజ్మా కర్రీ
    మిర్చి మసాలా
    బీరకాయ పల్లీ మసాలా
    సొరకాయ పల్లీల కూర
    బీరకాయ గసగసాలు
    గుత్తి పొట్లకాయ కూర
    టొమాటో గుత్తికూర
    బీరకాయ పెసరపప్పు కూర
    బ్రెడ్ మిక్స్‌డ్ వెజిటబుల్ బిర్యానీ
    పన్నీర్ దో ప్యాజా
    మునగాకు రసం
    పన్నీర్ అంగా
    రసవాంగి కూటు
    మునగాకు ఫ్రై
    పన్నీర్ బేబీ కార్న్
    కాకరకాయ మసాలా
    స్టఫ్డ్ భేండీ
    వజక్కయ్ కర్రీ
    చేమదుంప మసాలా
    మునగాకు పప్పు
    కొబ్బరి వేపుడు
    పన్నీర్ స్వీట్ కార్న్ మటర్
    మెంతాకు పన్నీర్
    పన్నీర్ మక్‌మలాయ్
    మొఘలాయీ కాలీఫ్లవర్
    పన్నీర్ క్యాప్సికం మసాలా
    కాప్సికం
    శనగపప్పు
    ఉసిరికాయ పప్పు
    బంగాళదుంప - మునగాకు ఫ్రై
    ఉల్లిపొరక కూర
    శెనగపప్పు ఉండల పులుసు
    కాలీఫ్లవర్
    వెల్లుల్లి కారం
    క్యాప్సికం కర్రీ
    చింతచిగురు దొండకాయ
    క్యాప్సికం పన్నీర్ కుర్మా
    బంగాళాదుంపలు
    చిక్కుడుగింజల కూర
    మొక్కజొన్నకుర్మా
    మొక్కజొన్నవేపుడు
    పన్నీర్ 65
    6b605723e1
    6d6af64986
    8c8cfd2e64
    8d0d675c9a
    90a7d6058e
    937f48c38a
    9640acb058
    Edd5508010
    Eeb66b27c8
    F20375deb0
    F4948ccbad
    Fdca5c53e4
    Fe39ccde14
    Fe7fa990a7
    Ff67fc0182
    Fffc315ddf

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.