పన్నీర్ - 3 కప్పులు,
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,
పాలు - పావు కప్పు,
గరంమసాలా - 1 1/2 టీ స్పూన్,
వెన్న - ఒక స్పూన్ ,
కొత్తిమీర - ఒక కట్ట,
పుదీనా - ఒక కట్ట,
పచ్చిమిరపకాయలు - 3,
అల్లం - చిన్న ముక్క,
కాజు - పావు కప్పు,
పెరుగు - పావు కప్పు,
నిమ్మరసం - ఒక స్పూన్,
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం, కాజు అన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పన్నీర్ వేసి అందులో ఆ పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. దీంట్లో కలిపి పెట్టుకున్న పన్నీర్ వేసి ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఆ తర్వాత పాలు, వెన్న వేసి కలపాలి. పాలు ఇంకిపోయేవరకు సన్నని మంట మీద ఉండనివ్వాలి. చివరగా గరంమసాలా వేసి దించేయాలి. హాట్‌గా ఆరగిస్తే పన్నీర్ మక్‌మలాయ్ చాలా ఉంటుంది.