మునగాకు - అర కేజీ
ధనియాల పొడి - టీ స్పూను
వేయించిన పల్లీలు - టీ స్పూను
వేయించిన నువ్వులు - టీ స్పూను
పుట్నాలపప్పు - టీ స్పూను
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - అర కప్పు
ఎండుమిర్చి - 8,
ఆవాలు - టేబుల్ స్పూన్
జీలకర్ర - టేబుల్ స్పూన్
మినప్పప్పు - మూడు టేబుల్ స్పూన్లు
శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 6,
పసుపు - కొద్దిగా
గరంమసాలా - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారి
- పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు... వీటిని విడివిడిగా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- మునగాకును శుభ్రం చేసి బాగా కడగాలి.
- బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
- ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి.
- గరంమసాలా పొడి, మునగాకులు, పసుపు, వేసి వేయించాలి.
- ఉప్పు, కొద్దిగా నీరు చిలకరించి, రెండు నిముషాలు ఉంచాలి.
- చివరగా పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు, ధనియాల... పొడులు వేసి బాగా కలిపి దించేయాలి.