బెండకాయలు-పావుకిలో, ఉల్లిపాయలు-మూడు
నూనె-తగినంత
అల్లం, వెల్లుల్లి-రెండు టేబుల్‌స్పూన్లు
పెరుగు-కప్పు
కారం -ఒక టేబుల్‌స్పూన్
ధనియాలపొడి-ఒకటిన్నర టీస్పూన్లు
పసుపు-చిటికెడు
జీలకర్రపొడి-అర టేబుల్‌స్పూన్
కార్న్‌ఫ్లోర్-చిటికెడు
యాలకులపొడి-అర టేబుల్‌స్పూన్
నల్లయాలకులపొడి-అర టేబుల్‌స్పూన్
సోంపు పొడి-పావు టేబుల్‌స్పూన్
మంచినీళ్లు-అరకప్పు
తయారుచేసే విధానం
ఉల్లిపాయల్ని పెద్దముక్కలుగా కోసి, ఉప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ముక్కలు కాస్త రంగు మారగానే నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బాలి. ఓ గిన్నెలో కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. అందులోనే పెరుగు వేసి గిలకొట్టినట్లుగా కలిపి ఉంచాలి. బెండకాయల్ని నిలువుగా గాట్లు పెట్టినట్లుగా కోయాలి. బాణలిలో నూనె వేసి బెండకాయల్ని వేయించి తీయాలి. అడుగున కొద్దిగా నూనె ఉంచి అందులో అల్లం,వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లిముద్ద వేసి సిమ్‌లో వేయించాలి. అందులోనే పెరుగు మిశ్రమం కూడా వేసి కలపాలి. తరువాతనీళ్లు, యాలకులపొడి, మొక్కజొన్నపొడి, నల్లజీలకర్ర పొడి, సోంపు పొడి వేసి కలపాలి. చివరగా వేయించిన బెండకాయల్ని వేసి సిమ్‌లో ఉడికించి దించాలి.