కాకరకాయలు : : ఎనిమిది
ఉల్లిపాయలు : మూడు
కారం : రెండు టీ స్పూన్లు
ధనియాలపొడి : ఒక టీ స్పూను
జీలకర్ర : ఒక టీ స్పూను
పసుపు : ఒక టీ స్పూను
ఉప్పు, నూనె : తగినంత
తయారు చేసే విధానం:
- పీలర్‌తో కాకరకాయలకు తొక్కు కొద్దిగా తీసి వేయాలి. మరీ లోతుగా చెక్కకుండా పైపైనే తీసివేయాలి.
- కాకరకాయల మధ్యలో పొడవుగా గాటు పెట్టి, లోపలి గింజలను తీయాలి. వీటికి ఉప్పు, పసుపు పట్టించి.. ఓ గంట పాటు ఊర బెట్టాలి.
- ఉల్లిపాయలను ముక్కలుగా కోసి.. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్ర మాన్ని కాకరకాయల మధ్యలో కూరి బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే కాకరకాయ మసాలా సిద్ధమైనట్లే..!
మూలం : సూర్య దినపత్రిక