పన్నీర్ - 200 గ్రా.
చిక్కని కొబ్బరి పాలు - కప్పు
పలుచని కొబ్బరి పాలు - అరకప్పు
పచ్చిమిర్చి - 5
కారం - ఒకటిన్నర టీస్పూన్లు
ధనియాల పొడి - టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
గరం మసాలా - టీస్పూన్
కొత్తిమీర తురుము- రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు - ఒక రెమ్మ
ఉల్లిపాయలు - రెండు
టొమాటోలు - 5
అల్లం వెల్లుల్లి ముద్ద- టేబుల్ స్పూన్
ఆవాలు - అరటీస్పూన్
జీలకర్ర - అరటీస్పూన్
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - టీస్పూన్
తయారుచేసే పద్ధతి:
- పాన్ లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి పది నిముషాలు ఉడికించాలి. ఇప్పుడు పలుచని కొబ్బరి పాలు పోసి చిక్కబడే వరకు ఉడికించాలి. తరువాత చిక్కని పాలు పోసి సిమ్ లో ఉడికించాలి. తర్వాత కొత్తిమీర తురుము చల్లి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం