కాలీఫ్లవర్ - అర కిలో
నూనె - 5 టేబుల్ స్పూన్లు
అల్లం - అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 13
లవంగాలు - 4
టొమాటో గుజ్జు - ఒకటిన్నర కప్పులు
జీలకర్ర - టీస్పూన్
మిరియాలు - ఒకటిన్నర టీస్పూన్లు
ఆవాలు - టీస్పూన్
పసుపు - టీస్పూన్
కాశ్మీరి కారం - రెండున్నర టీస్పూన్లు
కొత్తిమీర తురుము - కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- కాలిఫ్లవర్ పూరేమ్మలను దేనికది విడదీయాలి. కారం, పసుపు తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని ముద్దలా చేయాలి. తరువాత అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి.
- ఇప్పుడు ఈ మసాలా ముద్దను ఒక్కో రెమ్మకు పట్టించి ఒకటిన్నర గానతల పాటు నాననివ్వాలి. నానిన తర్వాత కాస్త నీరు ఊరుతుంది.
- నాని ఊరిన కాలీఫ్లవర్ ముక్కలను నీటితో పాటుగా బాణలిలో వేసి మూతపెట్టకుండా ఉడికించాలి. నీళ్లన్నీ అవిరైపోయాక దించాలి.
- విడిగా ఓ బాణలిలో నూనె వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా వేయించాలి. వేగాక టొమాటో గుజ్జు వేసి అది ముక్కలకు పట్టేవరకూ ఉడికించి దించాలి.
- చివరగా కొత్తిమీర అలంకరిస్తే సరి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం