వంకాయ ముక్కలు - 2 కప్పులు
బంగాళా దుంప ముక్కలు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 టీ.స్పూ.
టమాటా - 2
ఎండుమిర్చి -6
ఉప్పు - తగినంత
నువ్వులు - 2 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద - టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
నూనె - 3 టీ.స్పూ.
తయారుచేసే పద్ధతి :
- వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. లేకుంటే నల్లబడతాయి.
- ఎండుమిర్చి నీళ్లలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- పాన్ వేడి చేసి నువ్వులు కొద్దిగా వేపి తీసి పెట్టుకోవాలి. అదే పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్దవేసి కొద్దిగా వేపాలి. ఎండుమిర్చి ముద్ద కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత బంగాళ దుంప ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు, వేయించిన నువ్వులు వేసి కలిపి మూత పెట్టాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చివరగా గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఇందులో ఎండుమిర్చి బదులు పండుమిర్చి కూడా వాడుకోవచ్చు.
మూలం : ఆంధ్రభూమి