క్యారెట్,బెండ,వంకాయ,మునక్కాయ,సోరక్కాయ ముక్కలు - 2 కప్పులు
చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టీస్పూన్
పచ్చిమిర్చి - 6
ధనియాల పొడి - టీస్పూన్
ఉప్పు - సరిపడా
ఇంగువ - చిటికెడు
మెంతులు - టీస్పూన్
సెనగ పిండి - 6 టేబుల్ స్పూన్లు
పసుపు - చిటికెడు
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
నూనె - తగినంత
తయారుచేసే పద్ధతి :
- బాణలిలో నూనె వేయాలి. తరువాత ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. సెనగపిండి వేసి తిప్పుతూ ఉండాలి. పిండి మంచి వాసనా వచ్చాక సుమారు లీటర్ నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా తిప్పుతూ సిమ్ లోనే 20 నిముషాలు ఉడికించాలి. మరిగిన తర్వాత కూరగాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి ముక్కలు ఉడికే వరకు ఉంచాలి.ఉప్పు సరి చూసి కొత్తిమీర తురుముతో అలంకరించి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం