బఠాణీలు - పావు కప్పు,
ఉల్లిగడ్డలు - 3,
లవంగాలు - 2,
యాలకులు - 1,
దాల్చినచెక్క - 1,
టమాటాలు - 5,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్,
జీలకర్ర - పావు టీ స్పూన్,
మెంతులు - 5,
కారం - 2 టీ స్పూన్స్,
ధనియాల పొడి - 2 టీ స్పూన్స్,
గరంమసాలా పౌడర్ - అర టీ స్పూన్,
కొత్తిమీర - అర కట్ట,
చక్కెర - కొద్దిగా,
ఉప్పు, పసుపు,
నూనె - తగినంత
తయారు చేసే విధానం :
కడాయిలో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, మెంతులు వేయించాలి. వీటిని మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టాలి. మళ్లీ కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డలు, అల్లం వేసి వేయించాలి. కొద్దిగా వేగాక టమాటాలను వేసి కలపాలి. టమాటాలు బాగా ఉడకనివ్వాలి. దీన్ని కాసేపు చల్లారనిచ్చి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నూనె పోసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేగనివ్వాలి. దాంట్లో టమాటాప్యూరీ వేసి కలపాలి. సన్నని మంట మీద ఐదు నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత గరం మాసాలా పౌడర్, కారం, ధనియాల పొడి పసుపు వేసి కలపాలి. రెండు నిమిషాలాగి బఠాణీలు వేసి రెండు కప్పుల నీళ్ళుపోయాలి. దీంట్లో ధనియాలపొడి, చక్కెర, ఉప్పు వేసి కలపాలి. పదినిమిషాలపాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే గ్రీన్ పీస్ మసాలా రెడీ!