సొరకాయ ముక్కలు - రెండు కప్పులు
వేయించిన పల్లీలు - పావు కప్పు
కారం - చెంచ
వెల్లుల్లి రెబ్బలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - తగినంత
కరివేపాకు - రెండు రెమ్మలు
నూనె - రెండు లేక మూడు చెంచాలు
పసుపు - చిటికెడు
ఆవాలు - అరచెంచ
మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్ర - అన్నీ కలిపి రెండు చెంచాలు
తయారుచేసే పద్ధతి :
- సొరకాయ ముక్కల్లో చాలా కొద్దిగా నీళ్ళు పోసి ఒక కూత వచ్చేవరకూ కుక్కర్ లో ఉడికించుకోవాలి. ఆ ముక్కలు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి తాలింపు గింజల్ని వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి, రెండు లేక మూడు నిముషాలు వేగనివ్వాలి.
- వేయించుకున్న పల్లీలు, కారం, వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడిచేసుకోవాలి.
- కూరముక్కలోని తడిపోయాక ఈ పొడిని వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే సరిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, రొట్టేల్లోకి కూడా చాలా బాగుంటుంది.
మూలం : ఈనాడు వసుంధర