బంగాళాదుంపలు - 250 గ్రా.
సోయా కూర - 1 కట్ట
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 1 రెబ్బ
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
వండే విధం
బంగాళాదుంపలను చెక్కు తీసి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
సోయా కూర కూడా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, పసుపు, సోయాకూర వేసి కొద్దిగా కలిపి బంగాళా దుంప ముక్కలు వేసి కలిపి వేయించాలి.
ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించి వేయించాలి.
ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలు, పూరీలకు బావుంటుంది.