బెండకాయలు - కిలో
ఉల్లిగడ్డలు - 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -
ఒక స్పూన్
ధనియాల పొడి -
ఒక స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్
ఆమ్‌చూర్ పౌడర్ - ఒక టీ స్పూన్
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
బెండకాయలను మంచిగా కడిగి పెద్ద, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనెపోసి జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపేస్టూ కలపాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేగనిచ్చి బెండకాయ ముక్కలను వేయాలి. సన్నని మంట మీద ఒక పావు గంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో ముందుగా పసుపు, కారం వేసి కాసేపు కలపాలి. ఆ పై గరం మసాలా పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోవాలి. వేడి.. వేడి.. భేండీ మసాలా మీ ముందుంటుంది. ఈ కూర చపాతీల్లోకి చాలా బాగుంటుంది.