పన్నీర్ - 100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి)
స్వీట్ కార్న్ గింజలు - 50 గ్రా.
బఠానీ - 50 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ - 2 టీస్పూన్లు
ఉల్లితరుగు - 50 గ్రా.
టొమాటో ప్యూరి - 50 గ్రా.
పుదీనా - అరకప్పు
జీడిపప్పు+తర్బూజ గింజల పేస్ట్ - రెండు టీస్పూన్లు
పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
కొత్తిమీర - అరకప్పు
తయారుచేసే పద్ధతి :
- స్టవ్ మీద బాణలి ఉంచి అందులో మూడు స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, గరం మసాలా వేసి వేయించాలి.
- జీడిపప్పు+తర్బూజ గింజల పేస్ట్ వేసి వేగాక పసుపు, పచ్చిమిర్చిపేస్ట్, పుదీనా, టొమాటో ప్యూరి వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
- పన్నీర్, స్వీట్ కార్న్ గింజలు, బఠానీ వేసి ఉడికించి, అవి ఉడికాక, చివరగా కొత్తిమీర చల్లుకొని రోటీలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక