telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

చిక్కుడుగింజల కూర

9/29/2013

0 Comments

 
Picture
కావలసినవి: 
తాజా చిక్కుడుగింజలు - కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు;

పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
పల్లీలు - కొద్దిగా;

ధనియాలు - టీ స్పూను
ఎండుకొబ్బరి - చిన్నముక్క;

వెల్లుల్లి రేకలు - 3
ఉప్పు - తగినంత;

ఆవాలు - అర టీ స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూను
కొత్తిమీర - చిన్న కట్ట;

నూనె - 2 టీ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి: 
  • చిక్కుడుగింజలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కలిపి కుకర్‌లో ఉడికించాలి.
  • పల్లీలు, ధనియాలు వేయించి చల్లారాక, ఎండుకొబ్బరి, వెల్లుల్లిరేకలు జత చేసి మిక్సీలో వేసి పొడి చేయాలి.
  • ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి.
  • కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
  • చిక్కుడుగింజలు, పసుపు, కారం వేసి బాగా కలిపి, గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి జల్లి మూత పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి, దించే ముందర కొత్తిమీర చల్లాలి.


0 Comments

వంకాయ - చిక్కుడుగింజల కూర

9/28/2013

0 Comments

 
Picture
కావలసినవి: 
వంకాయలు - పావు కిలో
చిక్కుడు గింజలు - పావు కప్పు
పసుపు - చిటికెడు; 
జీలకర్రపొడి, కారం - పావు టీ స్పూను చొప్పున
ధనియాలపొడి - టీ స్పూను;

నూనె - ఒకటిన్నర టీ స్పూన్లు
అల్లంవెల్లుల్లిపేస్ట్ - టీ స్పూను;

కొత్తిమీర - చిన్నకట్ట
పచ్చిమిర్చి - 3;

జీలకర్ర - అర టీ స్పూను;
కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి: 
  • చిక్కుడు గింజలకు కొద్దిగా నీరు, ఉప్పు జతచేసి ఉడికించాలి.
  • బాణలిలో నూనె కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి రెండు నిముషాలు వేయించాలి.
  • ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి నాలుగైదు నిముషాలు వేయించాక, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి.
  • వంకాయముక్కలు, కొద్దిగా నీరు వేసి బాగా కలిపి, సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాక, చిక్కుడు గింజలు జత చేసి, మరో ఐదు నిముషాలు ఉంచి, దించేయాలి.


0 Comments

మునగాకు పప్పు

9/27/2013

0 Comments

 
Picture
కావలసినవి
పెసరపప్పు - 300 గ్రా.,
మునగాకు - 200 గ్రా.
టొమాటో తరుగు - పావు కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు
పసుపు - కొద్దిగా
శనగపప్పు - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
ధనియాలపొడి - టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
ఎండుమిర్చి - 2
ఆవాలు - టేబుల్ స్పూన్
జీలకర్ర - టేబుల్‌స్పూన్
రిఫైన్‌డ్ ఆయిల్ - 50 మి.లీ.
వెల్లుల్లి రేకలు - 10
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా

తయారి
  • ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి, పసుపు జత చేసి, తగినంత నీరు పోసి మెత్తగా ఉడికించాలి.
  • మునగ ఆకులను శుభ్రం చేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
  • బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర కరివేపాకు వేసి వేయించాలి.
  • వెల్లుల్లి రేకలు, ఉల్లితరుగు, టొమాటో తరుగు, మునగ ఆకులు వేసి కొద్దిగా ఉడికించాలి.
  • ఉడికించిన పెసరపప్పు జతచేసి, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి రెండు నిముషాలు ఉంచాలి.
  • కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేయాలి.


0 Comments

బీరకాయ, వెల్లుల్లి కారం

9/26/2013

0 Comments

 
Picture
కావలసినవి
బీరకాయలు - 500 గ్రా.
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 టీ.స్పూ.
ఎండుమిర్చి - 5
జీలకర్ర - 1/2 టీ.స్పూ.
ధనియాలు - 1 టీ.స్పూ.
వెల్లుల్లి రెబ్బలు - 10
ఉప్పు - తగినంత
నూనె - 4 టీ.స్పూ.

తయారు చేసేదిలా
బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి వెల్లుల్లి రెబ్బలు కలిపి బరకగా పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక వెల్లుల్లి కారం పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు నిదానంగా ఉడకనివ్వాలి. నీరంతా ఇగిరిపోయాక తర్వాత దింపేయాలి. బీరకాయలు లేతగా ఉంటే ఈ కూర చాలా త్వరగా తయారవుతుంది. అన్నం, చపాతీలకు బావుంటుంది.


0 Comments

టమాట పన్నీర్ కూర

9/24/2013

0 Comments

 
Picture
కావలసినవి
పన్నీర్‌-200గ్రా
నూనె-4 చెంచాలు
ఉల్లిపాయలు-3
ఉప్పు-రుచికి తగినంత, కారం-తగినంత
ధనియాలపొడి-ఒక చెంచా
పసుపు-చిటికెడు
టమాట గుజ్జు-పావుకప్పు
క్రీమ్‌-3 చెంచాలు
కొత్తిమీర-కొంచెం



తయారుచేసే విధానం
  • చెంచా నీళ్లలో కారం, ధనియాలపొడి, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  • అవి వేగాక ముందుగా నీళ్లలో కలిపిన మసాలా ముద్దను వేసి కలియతిప్పి పచ్చి వాసన పోయాక టమాట గుజ్జు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మూతపెట్టాలి. పది నిమిషాలయ్యాక పన్నీరు ముక్కలు చేర్చాలి. గ్రేవీలో పన్నీరు ఉడికాక క్రీమ్‌ వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూరను రోటీలో తింటే రుచిగా ఉంటుంది.


0 Comments

పాలక పనీర్

9/19/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు ....
పనీర్‌ 200 గ్రాములు
పాలకూర పదికట్టలు
టమాటలు రెండు
ఉల్లిపాయలు రెండు
పచ్చిమిర్చి 3,4
అల్లంవెల్లుల్లి ముద్ద టీ స్పూన్‌
గరంమసాలా పొడి టీ స్పూన్‌
కొత్తిమీర , నూనె తగినంత

తయారుచేసేవిధానం..
  • ముందుగా పాలకూరను శుభ్రంచేసి కడిగి, ముక్కలుగా చేసుకోవాలి.
  • ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాట ముక్కలు వేసి ఉడకబెట్టాలి.
  • ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌవ్‌ పై కడాయి పెట్టి అందులో నూనె వేసి పనీర్‌ ముక్కలను కాస్త వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు మరికొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించాలి.
  • పసుపు, కారం, అల్లంవెల్లుల్లి వేసి బాగా కలపాలి. ఇందులో రుబ్బిన పాలక్‌ మిశ్రమం, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలపాలి.
  • ఇప్పుడు పనీర్‌ ముక్కలను వేసి సన్నటి మంటపై ఉంచాలి. కూర గట్టిపడేవరకు ఉంచి స్టౌవ్‌ పై నుంచి దించేయాలి.
  • చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.


0 Comments

మునగాకు రసం

9/19/2013

0 Comments

 
Picture
కావలసినవి
కందిపప్పు - 200 గ్రా.
టొమాటో ముక్కలు - పావు కప్పు
చింతపండు - తగినంత,

మిరియాలు - 6
ధనియాలు - టీ స్పూను,

పచ్చిమిర్చి - 6
వెల్లుల్లి రేకలు - 8,

నూనె - రెండు టీ స్పూన్లు
మునగాకు - 200 గ్రా.
రిఫైన్‌డ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 8,

ఆవాలు - టేబుల్ స్పూను
జీలకర్ర - టేబుల్ స్పూను,

కరివేపాకు - రెండు రెమ్మలు
పసుపు - కొద్దిగా,

ఉప్పు - తగినంత
మినప్పప్పు - 100 గ్రా.,

కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి
  • ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, టొమాటో ముక్కలు జతచేసి, కుకర్‌లో మెత్తగా ఉడికించాలి.
  • చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోవాలి.
  • మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.
  • బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరసగా వేసి వేయించాలి.
  • మునగాకు జతచేసి, ఉడికించిన పప్పు, ఉప్పు, నీరు పోసి మూడు నాలుగు నిముషాలు ఉడికించాలి.
  • చింతపండు రసం, పసుపు వేసి బాగా మరిగించాలి.
  • కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి.


0 Comments

బీరకాయ కారం

9/18/2013

0 Comments

 
Picture
కావాల్సిన పదార్థాలు :
5 చిన్న బీరకాయలు
పచ్చి శనగపప్పు ఒక కప్పు
మినప్పప్పు అర కప్పు
ధనియాలు రెండు స్పూన్లు
ఎండు మిరపకాయలు 4
చింతపండు కొద్దిగా
కరివేపాకు


తయారు చేసే విధానం:

ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి పెద్ద ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. బాణలి పెట్టి నూనె వేసి కాగాక, జీలకర్ర, ఆవాలు వేసి పోపు వేయాలి. తరవాత కరివేపాకుతో పాటు బీరకాయ ముక్కలను కూడా వేసి, పసుపు,తగినంత ఉప్పు వేసి, సన్నని మంటపై మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికిన తరవాత తయారు చేసుకున్న పొడిని కలిపి, రెండు స్పూన్ల చింతపండు రసాన్ని కూడా చేర్చి మరో 5 నిమిషాలుంచి దించేయడమే!


0 Comments

మొక్కజొన్నవేపుడు

9/17/2013

0 Comments

 
Picture
కావలసినవి
లేతమొక్కజొన్న పొత్తులు-8,
మైదాపిండి-ఒక టీస్పూన్‌,
బియ్యప్పిండి-ఒక టీస్పూన్‌,
సశనగపిండి-ఒక టీస్పూన్‌,

పసుపు-కొద్దిగా,
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-ఒకటిన్నర టీస్పూన్లు
ఉల్లిపాయ-ఒకటి,

ఉప్పు-తగినంత,
మిర్చిపొడి-అరటీస్పూన్‌
నూనె-వేయించటానికి సరిపడినంత
ధనియాలపొడి-అర టీస్పూన్‌,
జీలకర్రపొడి-అర టీస్పూన్‌,

నిమ్మరసం-కొద్దిగా

తయారుచేసే విధానం
ముందుగా మొక్కజొన్న పొత్తులను నిలువుగా నాలుగు ముక్కలుగా చీల్చుకుని ఉంచుకోవాలి. మైదా, వరిపిండి, శనగపిండి, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిర్చిపొడులకు నీళ్లు కలిపి ఒక్కటి చేయాలి. ఈ మిశ్రమాన్ని మొక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి తక్కువ నూనెలో దోరగా వేగనివ్వాలి. తర్వాత వాటిని బయటకు తీసి వాటిపై జీలకర్ర, ధనియాలు పొడి అద్దాలి. తిరిగి వాటిపై నిమ్మరసం పిండాలి. ఆనియన్‌, కాప్సికమ్‌, టమాటా, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.


0 Comments

మునగాకు ఫ్రై

9/14/2013

0 Comments

 
Picture
కావలసినవి
మునగాకు - అర కేజీ
ధనియాల పొడి - టీ స్పూను
వేయించిన పల్లీలు - టీ స్పూను
వేయించిన నువ్వులు - టీ స్పూను
పుట్నాలపప్పు - టీ స్పూను
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - అర కప్పు
ఎండుమిర్చి - 8,

ఆవాలు - టేబుల్ స్పూన్
జీలకర్ర - టేబుల్ స్పూన్
మినప్పప్పు - మూడు టేబుల్ స్పూన్లు
శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 6,

పసుపు - కొద్దిగా
గరంమసాలా - అర టీ స్పూను
ఉప్పు - తగినంత

తయారి
  • పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు... వీటిని విడివిడిగా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • మునగాకును శుభ్రం చేసి బాగా కడగాలి.
  • బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
  • ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి.
  • గరంమసాలా పొడి, మునగాకులు, పసుపు, వేసి వేయించాలి.
  • ఉప్పు, కొద్దిగా నీరు చిలకరించి, రెండు నిముషాలు ఉంచాలి.
  • చివరగా పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు, ధనియాల... పొడులు వేసి బాగా కలిపి దించేయాలి.


0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    కంద
    ఆలూ గోబీ
    ఆలూ గోభీ
    మలై మటర్ పనీర్
    ఆలూ సోయా వేపుడు
    కడై పనీర్
    దహీ భేండీ
    ఆలూ కుర్మా
    మలై పన్నీర్
    ఆలు అమృత్‌సరి
    మలై కాలీఫ్లవర్
    సోయా
    బెండ
    సోయా - టొమాటో కర్రీ
    మునగ కూర
    దాల్ మఖని
    వెజ్ హలీం
    కుర్ కురీ భేండీ
    ములగ ఆకులు
    పాలక పనీర్
    గోడా మసాలా తయారీ
    టమాట పన్నీర్ కూర
    వంకాయ
    వంకాయ - చిక్కుడుగింజల కూర
    బెండి కా సాలన్
    సింధి కడి
    భేండీ భాజీ
    టమాటా బాజీ
    భేండీ మసాలా
    వంకాయ మసాలా
    బేసన్ బెండి
    టమాటా కుర్మా
    వంకాయ తొక్కు
    మటర్‌ పనీర్‌ కూర
    అచార్ పన్నీర్
    బఠానీ మష్రూమ్స్
    పాలక్ మీల్‌మేకర్
    బీరకాయ
    సొరకాయ
    పాఠోళి
    టొమాటో - ఎగ్ కర్రీ
    మిక్స్ డ్ వెజ్ కోకోనట్ కర్రీ
    మిర్చి కా సాలన్
    దోసకాయ కూర
    సుక్కి దాల్
    ఫ్రైడ్ టోపూ
    రాజ్మా రాస్ మిస్
    గ్రీన్ పీస్ మసాలా
    బీన్స్ మీల్ మేకర్ కూర
    రాజ్మా కర్రీ
    మిర్చి మసాలా
    బీరకాయ పల్లీ మసాలా
    సొరకాయ పల్లీల కూర
    బీరకాయ గసగసాలు
    గుత్తి పొట్లకాయ కూర
    టొమాటో గుత్తికూర
    బీరకాయ పెసరపప్పు కూర
    బ్రెడ్ మిక్స్‌డ్ వెజిటబుల్ బిర్యానీ
    పన్నీర్ దో ప్యాజా
    మునగాకు రసం
    పన్నీర్ అంగా
    రసవాంగి కూటు
    మునగాకు ఫ్రై
    పన్నీర్ బేబీ కార్న్
    కాకరకాయ మసాలా
    స్టఫ్డ్ భేండీ
    వజక్కయ్ కర్రీ
    చేమదుంప మసాలా
    మునగాకు పప్పు
    కొబ్బరి వేపుడు
    పన్నీర్ స్వీట్ కార్న్ మటర్
    మెంతాకు పన్నీర్
    పన్నీర్ మక్‌మలాయ్
    మొఘలాయీ కాలీఫ్లవర్
    పన్నీర్ క్యాప్సికం మసాలా
    కాప్సికం
    శనగపప్పు
    ఉసిరికాయ పప్పు
    బంగాళదుంప - మునగాకు ఫ్రై
    ఉల్లిపొరక కూర
    శెనగపప్పు ఉండల పులుసు
    కాలీఫ్లవర్
    వెల్లుల్లి కారం
    క్యాప్సికం కర్రీ
    చింతచిగురు దొండకాయ
    క్యాప్సికం పన్నీర్ కుర్మా
    బంగాళాదుంపలు
    చిక్కుడుగింజల కూర
    మొక్కజొన్నకుర్మా
    మొక్కజొన్నవేపుడు
    పన్నీర్ 65
    6b605723e1
    6d6af64986
    8c8cfd2e64
    8d0d675c9a
    90a7d6058e
    937f48c38a
    9640acb058
    Edd5508010
    Eeb66b27c8
    F20375deb0
    F4948ccbad
    Fdca5c53e4
    Fe39ccde14
    Fe7fa990a7
    Ff67fc0182
    Fffc315ddf

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.