పచ్చి బఠానీలు - ఒకటిన్నర కప్పు
పుట్టగొడుగులు - 200 గ్రా.
ఉల్లిపాయలు - రెండు
టొమాటోలు - నాలుగు
గరం మసాలా - టీస్పూన్
కారం - టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - 4 టేబుల్ స్పూన్లు
అల్లం,వెల్లుల్లి - రెండు టీస్పూన్లు
ధనియాల పొడి - టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
యాలకులు - 4
జీడిపప్పు ముద్ద - అరకప్పు
పసుపు - చిటికెడు
తయారుచేసే పద్ధతి :
పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఓ రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
జీడిపప్పు ముద్దను ఓ కప్పు నీళ్ళలో కలిపి బాణలిలో పోయాలి. తరువాత మరో కప్పు నీళ్ళు పోసి మరిగించాలి. ఇప్పుడు బఠానీలు, పుట్టగొడుగులు వేసి ఉడికిన తర్వాత దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం