చుక్కకూర తరుగు - 3 కప్పులు
శనగపప్పు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 2 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
తయారుచేసే పద్ధతి :
శనగపప్పు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. చుక్కకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, అవసరమైతే అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. ఇందులో కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి తడిపోయేవరకు వేపాలి. తర్వాత చుక్కకూర తరుగు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
చుక్కకూర మెత్తబడిన తర్వాత ఉప్పు సరిచూసుకుని గరం మసాలా పొడి కూడా వేసి కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. పప్పు, చుక్కకూర పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.