బెండకాయలు, క్యాప్సికం-అరకేజీ చొప్పున
జీలకర్ర-అరచెంచా, ఇంగువ-చిటికెడు
ఉప్పు, కారం-రుచికి తగినంత
అల్లం, పచ్చిమిర్చి ముద్ద-చెంచా చొప్పున
పసుపు-చిటికెడు
ధనియాలపొడి, జీలకర్ర పొడి-రెండు చెంచాల చొప్పున
ఎండు కొబ్బరి తురుము-అరకప్పు
కొత్తిమీర కట్టలు-రెండు
ఉప్పు-తగినంత
టమాటాలు-రెండు
నూనె-పావు కప్పు
తయారుచేసే విధానం
క్యాప్సికం, బెండకాయలు సన్నగా పొడవుగా తరిగి, సన్నటి సెగమీద నూనెలో వేయించాలి. ఇప్పుడు మరో బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి ఇంగువ, పసుపు, జీలకర్ర, జీలకర్ర పొడి, ధనియాలపొడి వేయాలి. ఆ వెంటనే సన్నగా తరిగిన టమాట ముక్కలు, ఉప్పు, కారం, అల్లం పచ్చిమిర్చి ముద్ద, కొబ్బరి కోరు వేయించి ఐదు నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు బెండకాయ, క్యాప్సికం ముక్కలు చేర్చి మూతపెట్టాలి. సన్నటి సెగపై కూర బాగా మగ్గనిచ్చి కొత్తిమీరతో అలంకరిస్తే బెండకాయ క్యాప్సికం కూర సిద్ధమయినట్టే.