నేతిలో వేయించిన బ్రెడ్ స్లైసులు - 250 గ్రా.
ఉల్లితరుగు - కప్పు;
టొమాటో తరుగు - కప్పు
బఠాణీ - కప్పు;
ఉడికించిన బీన్స్ తరుగు - కప్పు
ఉడికించిన బంగాళదుంప ముక్కలు - అర కప్పు
బటర్ - 3 టేబుల్ స్పూన్లు;
జీలకర్ర - అర టేబుల్ స్పూను
నూనె - తగినంత;
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - కట్ట;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
ఉప్పు - తగినంత;
వేయించిన జీడిపప్పు- కప్పు
పసుపు - టేబుల్ స్పూను;
కారం - టేబుల్ స్పూను
నిమ్మరసం - కప్పు;
బిర్యానీ మసాలా - టేబుల్ స్పూను
తయారుచేసే పద్ధతి:
- స్టౌ మీద బాణలి ఉంచి నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి.
- కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించి, ఉల్లితరుగు, టొమాటో తరుగు, కూరముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి.
- వేయించి ఉంచిన బ్రెడ్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, బీన్స్ తరుగు వేయాలి.
- జీడిపప్పు, కారం, పసుపు వేసి మంట తగ్గించాలి.
- బిర్యానీ మసాలా, బటర్ వేసి కలపాలి.
- కొద్దిగా నూనె జతచేయాలి.
- నిమ్మరసం వేసి రెండు నిముషాలు వదిలేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక