వంకాయలు లేదా తెల్లగుమ్మడి ముక్కలు : 8 కప్పులు
కందిపప్పు ఒక కప్పు
చింతపండు 2 నిమ్మకాయలంత
పుట్నాల పప్పు : 8 టీ స్పూను
ఉప్పు సరిపడా
ఇంగువ కాస్తంత
పసుపు చిటికెడు
రసంపొడి రెండు టీ స్పూను
బెల్లం చిన్న ముక్క
మసాలా కోసం...
ధనియాలు 8 టీ స్పూన్లు
కొబ్బరి తురుము : 8 టీ స్పూన్లు
ఎండుమిర్చి నాలుగు
బియ్యం 2 టీ స్పూన్లు
తాలింపు కోసం...
ఆవాలు 2 టీ స్పూన్లు
కరివేపాకు 8 రెమ్మలు
నూనె 4 టీ స్పూన్లు
తయారు చేసే విధానం:
- మసాలా కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేయించి చల్లార్చి పొడి చేయాలి.
- కడాయిలో నూనె వేసి సెనగ పప్పు వేసి వేగాక ఆవాలు కరివేపాకు వేయాలి. తరువాత వంకాయ ముక్కలు వేయాలి. కాసేపు ముక్కలు వేగాక పసుపు, ఇంగువ, ఉప్పు, చింతపండుగుజ్జు, రసం పొడి, వేయించిన శెనగపప్పు వేసి, ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఆపై మసాలా పొడి చల్లి ఉడికించిన కందిపప్పు, బెల్లం తురుము కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించి దించేయాలి. అంతే రసవాంగి కూటు తయారైనట్లే..!
మూలం : సూర్య దినపత్రిక