పొట్లకాయ - 1
బంగాళదుంప - 1 (ఉడికించి పెట్టుకోవాలి)
ఉల్లి తరుగు - ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు - 1 టీస్పూన్
కొత్తిమీర తరుగు - అరకప్పు
నిమ్మరసం - ఒక టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
రవ్వ - 3 టేబుల్ స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
పొట్లకాయను ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్ చేసి, లోపలి గుజ్జు, గింజలు తీసేయాలి. ఒక పాత్రలో చిదిమిన ఆలు, ఉల్లి, మిర్చి, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు కలిపి ముక్కల్లో నింపాలి. కూర కనిపించే భాగాల్ని రవ్వలొ అద్ది సన్నని మంటపై నూనెలో దోరగా వేయించాలి. (ఇష్టమైతే ఆలు మిశ్రమానికి బదులు శనగ పిండి, పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, పంచదార, చింతపండు గుజ్జుల మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకొని పొట్ల గొట్టాల్లో పూడ్చవచ్చును)