పచ్చి శనగ పప్పు : కప్పు (నీటిలో ఓ గంట పాటు నానపెట్టాలి)
సొరకాయ ముక్కలు : ఒకటిన్నర కప్పు
పసుపు : చిటికెడు
కొబ్బరి పొడి : చిన్న కప్పు
పచ్చిమిరపకాయలు : మూడు లేదా నాలుగు
జీలకర్ర : అర టీస్పూను
ఆవాలు : టేబుల్ స్పూను
ఎండుమిరపకాయలు : రెండు లేదా మూడు
ఇంగువ : చిటికెడు
కరివేపాకు : కొద్దిగా
నూనె : తగినంత
తయారీ విధానం :
ముందుగా కొబ్బరి పొడి, పచ్చి మిరపకాయలు, జీలకర్ర మూడింటిని కొద్దిగా నూనె పోసి ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె లేదా బాండిలో కప్పు నీరు పోసి నానపెట్టి పెట్టుకున్న శనగపప్పు, సొరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే ఒకటి రెండు విజిల్స్ రాగానే దింపేసుకోవాలి. ఆ నీరు ఒంపకుండా అందులోనే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ముద్ద, ఉప్పు, పసుపు వేసి కూర ముద్దగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. చివరగా ఇంగువ కూడా జతచేసి ఈ తిరగమోతను ఉడుకుతున్న సొరకాయ కూటుకు జతచేయాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర, చల్లి దించేయాలి. ఇది చపాతీల్లోకి చాల రుచిగా ఉంటుంది.
మూలము : నవ్య