పనీర్ 200 గ్రాములు
పాలకూర పదికట్టలు
టమాటలు రెండు
ఉల్లిపాయలు రెండు
పచ్చిమిర్చి 3,4
అల్లంవెల్లుల్లి ముద్ద టీ స్పూన్
గరంమసాలా పొడి టీ స్పూన్
కొత్తిమీర , నూనె తగినంత
తయారుచేసేవిధానం..
- ముందుగా పాలకూరను శుభ్రంచేసి కడిగి, ముక్కలుగా చేసుకోవాలి.
- ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాట ముక్కలు వేసి ఉడకబెట్టాలి.
- ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో నూనె వేసి పనీర్ ముక్కలను కాస్త వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మరికొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించాలి.
- పసుపు, కారం, అల్లంవెల్లుల్లి వేసి బాగా కలపాలి. ఇందులో రుబ్బిన పాలక్ మిశ్రమం, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలపాలి.
- ఇప్పుడు పనీర్ ముక్కలను వేసి సన్నటి మంటపై ఉంచాలి. కూర గట్టిపడేవరకు ఉంచి స్టౌవ్ పై నుంచి దించేయాలి.
- చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.