పన్నీర్ - 100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి)
మైదా - 20 గ్రా.
కార్న్ ఫ్లోర్ - 20 గ్రా.
అల్లం పేస్ట్ - టీస్పూన్
కారం - టీస్పూన్
పసుపు - అరటీస్పూన్
గరం మసాలా - టీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
ఉల్లి తరుగు - పావు కప్పు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారుచేసే పద్ధతి :
- స్టవ్ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి వేగాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్ వేసి కలపాలి.
- ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి.
- చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టవ్ మీద ఉంచి, కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు వేసి బాగా వేయించాలి.
- తయారుచేసి ఉంచుకున్న పన్నీర్ 65ను వీటితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక