పెరుగు మీద మీగడ : 100 గ్రా.
క్యారెట్ : 100 గ్రా.
ఆనపకాయ : 200 గ్రా.
బంగాళాదుంపలు : 100 గ్రా.
శనగపిండి : 50 గ్రా.
పచ్చిమిరపకాయలు : 20 గ్రా.
కొత్తిమీర : రెండు కట్టలు
నిమ్మకాయ : సగం చెక్క
రిఫైన్డ్ ఆయిల్ : వేయించడానికి సరిపడా
ఉప్పు : తగినంత
గ్రేవీ కోసం...
జీడిపప్పు : 25 గ్రా.
గసగసాలు : 25 గ్రా.
కారంపొడి : ఒక టీ స్పూన్
పెరుగు : 1/2 టీ స్పూను
క్రీమ్ : 50 మి.లీ.
అల్లం వెల్లుల్లి : ఒక టీస్పూన్
ఉల్లిపాయలు : 100 గ్రా.
గరం మసాలా : చిటెకెడు
తయారు చేసే విధానం:
- క్యారెట్, ఆనపకాయల చెక్కుతీసి తురిమి పెట్టుకోవాలి.
- ఆనపకాయ నుంచి నీళ్ళు పూర్తిగా పిండేయాలి.
- ఉడక బెట్టిన బంగాళాదుంపలను కూడా తురిమి ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకొని దానిలో పచ్చి మిరపకాయలు వేయించి అందులో శనగపిండి కూడా దోరగా వేయించి ఆ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనపకాయలను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి కిందకు దింపేయండి.
- దానిలో తురిమిన బంగాళా దుంపలు, పెరుగుమీగడ, కొత్తిమీర, నిమ్మకాయ, తగినంత చేర్చి, పిరమిడ్లలాంటి కోఫ్తాలుగా చేయండి.
- ఆ తర్వాత వీటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కాగిన నూనెలో దోరగా వేయించి, ఒక డిష్‌లో అమర్చండి.
- వీటిమీద తయారుచేసి ఉంచుకున్న గ్రేవిని పోసి పైన కొత్తిమీర, క్రీమ్‌తో వడ్డించండి.
గ్రేవీ కోసం :
- జీడిపప్పు, గసగసాలు మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోండి.
- ఒక గిన్నెలో వందగ్రాముల నూనెపోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించి, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, వేశాక నూరిన మసాలను కలిపి నూనె తేలేవరకూ ఫ్రై చేయండి.
- అందులో పెరుగు, గరం మసాలా, తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి.