పన్నీర్ క్యూబ్స్ - ఒక కప్పు,
సోంపు గింజలు - ఒక టీ స్పూన్,
జీలకర్ర - అర టీ స్పూన్,
ఆవాలు - పావు టీ స్పూన్,
మెంతులు - 5,
ఇంగువ - అర టీ స్పూన్,
మామిడికాయ పచ్చడి (ముక్కలు లేకుండా) - 2 స్పూన్స్,
ఉల్లిగడ్డ - 1,
కారం - అర టీ స్పూన్,
పసుపు - పావు టీ స్పూన్,
పెరుగు - 3/4 కప్పు,
మైదా - ఒక టీ స్పూన్,
కొత్తిమీర - ఒక కట్ట,
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
ఒక గిన్నెలో జీలకర్ర, సోంపు గింజలు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఆ పోపుగింజలను వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి. ఇందులో పన్నీర్ క్యూబ్స్, పసుపు, కారం, పచ్చడి, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత పెరుగు, మైదా వేసి మరికాసేపు కలపాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. అచార్ పన్నీర్ చపాతీల్లోకి చాలా బాగుంటుంది.