బంగాళాదుంపలు - నాలుగు
శెనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్‌స్పూన్
పచ్చిమిర్చి - మూడు (సన్నగా తరగాలి)
ఉల్లిపాయలు - రెండు (తరగాలి)
టొమాటోలు - మూడు (సన్న ముక్కలుగా తరగాలి)
జీలకర్ర, కారం, అనార్ దానా పొడి (ఎండపెట్టిన దానిమ్మగింజల పొడి) - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
పసుపు - కొద్దిగా
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టీస్పూన్
వాము, బేకింగ్‌సోడా - ఒక్కోటి చిటికెడు చొప్పున
ఆమ్‌చూర్ పొడి - పావు టీస్పూన్
నెయ్యి - ఒకటేబుల్ స్పూన్
నూనె - సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేసే పద్ధతి :
- బంగాళాదుంపల పొట్టు తీసి పొడవైన ముక్కలుగా కోసుకోవాలి.
- శెనగపిండి, ఉప్పు, జీలకర్ర పొడి, వాము, దానిమ్మ గింజల పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, బేకింగ్ సోడా, అర టీస్పూన్ నెయ్యిలను ఒక గిన్నెలో వేసుకోవాలి. నెమ్మది నెమ్మదిగా నీళ్లు పోస్తూ చిక్కగా కలుపుకోవాలి.
- ఇందులో బంగాళా దుంపల ముక్కల్ని వేసి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
- పెద్ద గిన్నెలో వేగించడానికి సరిపడా నూనె పోసి నానిన బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేగించాలి. నూనె పీల్చుకునే పేపర్ మీద వాటిని వేయాలి.
- ఆ తరువాత మిగిలిన నెయ్యిని ఒక నాన్‌స్టిక్ పాన్‌లో వేసుకుని అందులో ఉల్లిపాయ తరుగు వేసి మెత్తగా అయ్యే వరకు వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు మిగిలిన పదార్ధాలన్నింటినీ వేసి కలిపి పాన్ మీద మూతపెట్టి ఏడు నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించాలి. గ్రేవీ చిక్క బడిన తరువాత వేగించిన బంగాళాదుంప ముక్కల్ని వేసి కలియపెట్టాలి. మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి అలంకరించాలి.
మూలం : సూర్య దినపత్రిక