బీన్స్ - 200 గ్రా.
మీల్‌మేకర్ - 50 గ్రా.
జీలకర్ర - 1 టీ.స్పూ.
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
పంచదార -1/2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
ఎండుమిర్చి - 2
ఉల్లిపాయ - 1 చిన్నది
వెల్లుల్లి - 4 రెబ్బలు
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - 2 టీ.స్పూ.
ఇలా వండాలి
- ఒక గినె్నలో మూడు గ్లాసుల నీళ్లు మరిగించి మీల్ మేకర్ వేసి దింపేయాలి. చల్లారిన తర్వాత నీరంతా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
- బీన్స్ నార తీసి ఒకటి లేదా రెండు అంగుళాల సైజులో కట్ చేసుకోవాలి.
- పాన్‌లో నూనె వేడి చేసి ఎండుమిర్చితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో నలక్కొట్టి సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం పొడి వేసి కలిపి మీల్‌మేకర్ వేయాలి.
- వీటిని కొద్దిసేపు వేయించాక బీన్స్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. బీన్స్ ముందే సగం ఉడికించి పెట్టుకోవచ్చు.
- బీన్స్ వేగిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. నీరు పూర్తిగా ఇగిరిపోయిన తర్వాత దింపేయాలి. ఇష్టముంటే టమాటాలు, కొబ్బరిపొడి వేసి కుర్మాలా కూడా చేసుకోవచ్చు.