telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

బీరకాయ పల్లీ మసాలా

10/31/2013

0 Comments

 
Picture
కావలసినవి:
బీరకాయ (పెద్దది) - ఒకటి,
ఉల్లిపాయ (పెద్దది, తరిగి) - ఒకటి,
వేగించిన పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు,
ఎండుమిర్చి - ఐదు,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - ఒక టేబుల్ స్పూన్.
తాలింపుకు:

నువ్వుల నూనె - ఒక టేబుల్ స్పూన్,
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ - ఒక్కో టీస్పూన్.

తయారీ:
బీరకాయ చెక్కు తీసేసి సన్నగా తరగాలి. వేగించిన పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు వేయాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరువాత తరిగిన బీరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. (నీళ్లు పోయొద్దు. ఉడికేటప్పుడు బీరకాయ ముక్కల నుంచి నీరు వస్తుంది.) చివరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి కలిపి కొన్ని నిమిషాల తరువాత స్టవ్ పైనుంచి గిన్నె దింపేయాలి. ఈ కూరని వేడివేడిగా అన్నం, రోటీ, పరాఠాల్లో తింటే బాగుంటుంది.

0 Comments

టొమాటో గుత్తికూర

10/26/2013

0 Comments

 
Picture
 కావలసినవి:
 టొమాటోలు - 250 గ్రా (గాట్లు పెట్టాలి);

ఉల్లిపాయలు - 2;
కొబ్బరిపొడి - 2 టేబుల్‌స్పూన్లు;
జీలకర్ర పొడి - 1/2 టీ స్పూన్;
మెంతిపొడి - 1/4 టీ స్పూన్;
పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు;
పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు;
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు;
చింతపండు పులుసు - 1/4 కప్పు;
ఉప్పు - తగినంత;
కారం - టీ స్పూన్;
ధనియాల పొడి - టేబుల్ స్పూన్;
అల్లం వెల్లుల్లి ముద్ద - టీస్పూన్;
కరివేపాకు - 1 రెమ్మ;
నూనె - 3 టేబుల్ స్పూన్లు
 
 తయారి:
 ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు (నూనె లేకుండా) కొద్దిగా వేయించి, పొడి చేసుకోవాలి. నూనె వేడి చేసి, ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. మిక్సీలో... ముందుగా తయారుచేసి ఉంచుకున్న పొడి, చింతపండు పులుసు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక, గాట్లు పెట్టి ఉంచుకున్న టొమాటో లను మగ్గనివ్వాలి. తరవాత గ్రైండ్ చేసిపెట్టుకున్న మసాలాపేస్ట్, కొద్దిగా నీరు కలిపి చిక్కగా చేసి ఈ టొమాటోల మీద పోసి కలిపి మూతపెట్టి,  మంట తగ్గించాలి. నూనె తేలేవరకు ఉడికించి, కొత్తిమీర తో గార్నిష్ చేయాలి.


0 Comments

మిర్చి కా సాలన్

10/25/2013

0 Comments

 
Picture
మిర్చి కా సాలన్ చేయడానికి కావలసిన వస్తువులు:
మిరపకాయలు – 250 గ్రాములు
చింతపండు పులుసు – 1/4 కప్పు
పసుపు  – 1/4 టీస్పూన్
కారం పొడి – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
మెంతి పొడి – 1/4 టీస్పూన్
పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్స్
నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్స్
ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
జీలకర్ర – 1/4 టీస్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
మెంతులు – చిటికెడు
నూనె – 4 టేబుల్ స్పూన్స్

  •  ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది.
  • ప్యాన్‌లో నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీలపొడి, నువ్వుల పొడి, జీలకర్ర , మెంతిపొడి వేసి బాగా కలిపి  ఉంచాలి.
  • ఇందాక మిరపకాయలు వేయించిన ప్యాన్ లోనే  నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా మరిగించాలి.
  • పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన మిరపకాయలు, గరం మసాలా పొడి  వేసి మరో ఐదునిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె తేలగానే దింపేయాలి.
  • కమ్మటి , ఘాటైన మిర్చి కా సాలన్ తయారైంది. ఈజీగా ఉంది కదా.. ఈ కూర బిరియాని. వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్ లకు, రొట్టెలకు కూడా బావుంటుంది.

0 Comments

ఆలూ గోబీ

10/23/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - 1,

ఆలుగడ్డలు - 4,
టమాటా - 1,
పసుపు - ఒక టీ స్పూన్,
కారం - అర టీ స్పూన్,
కొత్తిమీర - పావు కట్ట,
ధనియాల పొడి - ఒక టీ స్పూన్,
ఉప్పు, నూనె - తగినంత

తయారు చేసే విధానం :
  • కాలీఫ్లవర్, ఆలుగడ్డలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • కడాయిలో నూనె పోసి కాలీఫ్లవర్, ఆలుగడ్డలను వేసి వేయించాలి.
  • పది నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. మరో ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే.. ఆలూ గోబీ రెడీ!


0 Comments

మలై మటర్ పనీర్

10/20/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు ....
పనీర్‌ 250 గ్రాములు,

ఉడికించిన పచ్చి బఠాణీలు రెండు కప్పులు
మీగడ పావు కప్పు ,
పెరుగు అర కప్పు
ఉల్లిపాయ పేస్ట్‌ 2 టేబుల్‌ స్పూన్‌,
ధనియాల పొడి 1 టేబుల్‌ స్పూన్‌,
ఆవాల పొడి 1/2 టీస్పూన్‌,
కారం 1/2 టీ స్పూన్‌,
కొత్తి మీర , పసుపు, ఉప్పు , గరం మసాల పొడి , తగినంత నూనె,

తయారు చేసే విధానం :

పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. ధనియాల పొడి, కారం పొడి, ఆవపొడి, పసుపు,ఉప్పు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు బాగా వేగనివ్వాలి. ఇందులో పెరుగు పోసి ఒక నిమిషం పాటు కలపాలి. తర్వాత మీగడ , తరిగి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు, ఉడక బెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి బాణలిపై మూత పెట్టాలి. ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దానిని వేరొక గిన్నెలో వేసి గరం మసాల పొడి వేసి కొత్తిమీరతో అలంకరించాలి. మటర్‌ పనీర్‌ రెడీ. అన్నంతో, చపాతితో తింటే చాలా రుచిగా ఉంటుంది.


0 Comments

పాలక్ మీల్‌మేకర్

10/20/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పాలకూర 2 కప్పులు,

మీల్ మేకర్ కీమా -1/2 కప్పు,
ఉల్లిపాయ 1,
పసుపు 1/ స్పూన్,
కారం పొడి స్పూన్,
ఉప్పు తగినంత,
గరం మసాలా పొడి -1/ స్పూన్,
కరివేపాకు -2 రెబ్బలు,
అల్లం ముద్ద -1 స్పూన్,
నెయ్యి -1 స్పూన్,
నూనె -3 స్పూన్

తయారు చేసేవిధానం :
  • మీల్‌మేకర్‌ని వేడి నీళ్లలో వేసి పదినిమిషాలపాటు ఉంచాలి. తర్వాత నీరంతా పిండేసి పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక మీల్‌మేకర్ వేసి కొద్దిగా వేయించాలి. దీనివల్ల మీల్‌మేకర్‌కు మంచి వాసన వస్తుంది.
  • పాలకూర కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
  • తర్వాత పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేయించి తరిగిన పాలకూర, ఉప్పు, కారం పొడి వేసి కలిపి మూతపెట్టాలి.
  • చిన్నమంట మీద పాలకూర మొత్తం ఉడికేవరకు ఉంచి వేయించుకున్న మీల్ మేకర్, గరం మసాలా పొడి వేసి బాగా కలియబెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ కూర అన్నం, రొట్టెల్లోకి బాగుంటుంది.

0 Comments

టొమాటో - ఎగ్ కర్రీ

10/19/2013

0 Comments

 
Picture
 కావలసినవి:
 టొమాటోలు - 6; కోడిగుడ్లు - 3; ఉల్లిపాయ - 1; కరివేపాకు - 1 రెమ్మ; అల్లం వెల్లుల్లి ముద్ద - చిన్న చెంచాడు; పసుపు - 1/4 టీస్పూన్; కారంపొడి - 1 టీ స్పూన్; గరంమసాలా పొడి - 1/4 టీ స్పూన్; ఉప్పు - తగినంత; నూనె - 3 టీ స్పూన్లు;
 
 తయారి:
 బాణలిలో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి, కారం పొడి వేయాలి. రెండు నిమిషాలు వేయించి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు కలిపి మూతపెట్టాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గి, మెత్తబడిన తర్వాత, బాగా కలిపి, కోడిగుడ్లు కొట్టి వేయాలి. గుడ్డు సగం ఉడికిన తర్వాత గరిటెతో మెల్లగా కలపాలి. దీనివల్ల గుడ్డు పెద్దపెద్ద ముక్కలుగా అవుతుంది. నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరంమసాలా చల్లి దింపేయాలి. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది.


0 Comments

బెండి కా సాలన్

10/18/2013

0 Comments

 
Picture
కావలసినవి
బెండకాయలు-పావుకిలో, ఉల్లిపాయలు-మూడు
నూనె-తగినంత
అల్లం, వెల్లుల్లి-రెండు టేబుల్‌స్పూన్లు
పెరుగు-కప్పు
కారం -ఒక టేబుల్‌స్పూన్‌
ధనియాలపొడి-ఒకటిన్నర టీస్పూన్లు
పసుపు-చిటికెడు
జీలకర్రపొడి-అర టేబుల్‌స్పూన్‌
కార్న్‌ఫ్లోర్‌-చిటికెడు
యాలకులపొడి-అర టేబుల్‌స్పూన్‌
నల్లయాలకులపొడి-అర టేబుల్‌స్పూన్‌
సోంపు పొడి-పావు టేబుల్‌స్పూన్‌
మంచినీళ్లు-అరకప్పు
తయారుచేసే విధానం
ఉల్లిపాయల్ని పెద్దముక్కలుగా కోసి, ఉప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ముక్కలు కాస్త రంగు మారగానే నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బాలి. ఓ గిన్నెలో కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. అందులోనే పెరుగు వేసి గిలకొట్టినట్లుగా కలిపి ఉంచాలి. బెండకాయల్ని నిలువుగా గాట్లు పెట్టినట్లుగా కోయాలి. బాణలిలో నూనె వేసి బెండకాయల్ని వేయించి తీయాలి. అడుగున కొద్దిగా నూనె ఉంచి అందులో అల్లం,వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లిముద్ద వేసి సిమ్‌లో వేయించాలి. అందులోనే పెరుగు మిశ్రమం కూడా వేసి కలపాలి. తరువాతనీళ్లు, యాలకులపొడి, మొక్కజొన్నపొడి, నల్లజీలకర్ర పొడి, సోంపు పొడి వేసి కలపాలి. చివరగా వేయించిన బెండకాయల్ని వేసి సిమ్‌లో ఉడికించి దించాలి.


0 Comments

కోడిగుడ్డు గ్రేవీ

10/17/2013

0 Comments

 
Picture
ఇవి కావాలి:
  గుడ్లు            : ఆరు
ఉల్లిపాయలు        : రెండు
అల్లం            : తగినంత
జీలకర్ర           : చెంచా
టమాటా గుజ్జు      : అరకప్పు
పచ్చిమిర్చి         : రెండు
పచ్చికొబ్బరి తురుము  : కప్పు
పసుపు           : చిటికెడు
ఆవనూనె         : ఆరుచెంచాలు
గరంమసాలా        : ఒకటిన్నర చెంచా
ఉప్పు            : రుచికి తగినంత

ఇలా చేయాలి:
సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఉడికించుకించిన కోడుగుడ్లను తీసుకొనవలెను. బాణలిలో నూనె వేడి చేసి కోడిగుడ్లను బంగారువర్ణంలో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి. అదే నూనెలో మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించి ఆ తరువాత ఉల్లిమిశ్రమాన్ని చేర్చాలి.పచ్చివాసన పోయి నూనె పైకి తేలాక పసుపు, కొబ్బరి తురుము చేర్చి సన్నటి మంట ఉంచాలి. ఐదు నిమిషాల తరువాత టమాటా గుజ్జు, కప్పు నీళ్లు, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి మూతపెట్టేయాలి. గ్రేవీ పూర్తిగా తయారయ్యాక గుడ్లను నాలుగు ముక్కలుగా కోసి గ్రేవీలో వేసి గరంమసాలా చల్లి మూడు నిమిషాలయ్యాక దించేస్తే సరిపోతుంది. కమ్మని నోరూరించే గ్రేవి రెడీ...


0 Comments

కంద, ఉల్లిపొరక కూర

10/16/2013

1 Comment

 
Picture
కావలసినవి
కంద - 250 గ్రా.
ఉల్లిపొరక - 500గ్రా.
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద - 1/2 టీస్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.

వండండి ఇలా
  • కందదుంపపై చెక్కు తీసి  చిన్న చిన్న ముక్కలుగా కట్  చేసుకోవాలి.
  • ఉల్లిపొరక  కూడా శుభ్రం చేసుకుని  సన్నగా కట్ చేసుకోవాలి.  ఇందులో తెల్లని ఉల్లి భాగం  విడిగా పెట్టుకోవాలి.
  • పాన్‌లో  నూనె వేడి చేసి ఉల్లిపాయ  ముక్కలు వేసి  మెత్తబడేవరకు వేపాలి.
  • ఇందులో పసుపు, అల్లం  వెల్లుల్లి ముద్ద వేసి  మరికొద్దిగా వేపి కంద  ముక్కలు వేయాలి. రెండు  నిమిషాలు వేగిన తర్వాత కడిగిన ఉల్లిపొరక తరుగు  వేసి కలిపి మూత పెట్టాలి.
  • కొద్దిగా మగ్గిన తర్వాత కారం  పొడి, ధనియాల పొడి,  తగినంత ఉప్పు వేసి కలిపి  మూత పెట్టాలి.
  • కూర ఉడికిన  తర్వాత గరం మసాలా పొడి  కలిపి దింపేయాలి. ఈ కూర  చపాతీలకు బావుంటుంది.


1 Comment
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    కంద
    ఆలూ గోబీ
    ఆలూ గోభీ
    మలై మటర్ పనీర్
    ఆలూ సోయా వేపుడు
    కడై పనీర్
    దహీ భేండీ
    ఆలూ కుర్మా
    మలై పన్నీర్
    ఆలు అమృత్‌సరి
    మలై కాలీఫ్లవర్
    సోయా
    బెండ
    సోయా - టొమాటో కర్రీ
    మునగ కూర
    దాల్ మఖని
    వెజ్ హలీం
    కుర్ కురీ భేండీ
    ములగ ఆకులు
    పాలక పనీర్
    గోడా మసాలా తయారీ
    టమాట పన్నీర్ కూర
    వంకాయ
    వంకాయ - చిక్కుడుగింజల కూర
    బెండి కా సాలన్
    సింధి కడి
    భేండీ భాజీ
    టమాటా బాజీ
    భేండీ మసాలా
    వంకాయ మసాలా
    బేసన్ బెండి
    టమాటా కుర్మా
    వంకాయ తొక్కు
    మటర్‌ పనీర్‌ కూర
    అచార్ పన్నీర్
    బఠానీ మష్రూమ్స్
    పాలక్ మీల్‌మేకర్
    బీరకాయ
    సొరకాయ
    పాఠోళి
    టొమాటో - ఎగ్ కర్రీ
    మిక్స్ డ్ వెజ్ కోకోనట్ కర్రీ
    మిర్చి కా సాలన్
    దోసకాయ కూర
    సుక్కి దాల్
    ఫ్రైడ్ టోపూ
    రాజ్మా రాస్ మిస్
    గ్రీన్ పీస్ మసాలా
    బీన్స్ మీల్ మేకర్ కూర
    రాజ్మా కర్రీ
    మిర్చి మసాలా
    బీరకాయ పల్లీ మసాలా
    సొరకాయ పల్లీల కూర
    బీరకాయ గసగసాలు
    గుత్తి పొట్లకాయ కూర
    టొమాటో గుత్తికూర
    బీరకాయ పెసరపప్పు కూర
    బ్రెడ్ మిక్స్‌డ్ వెజిటబుల్ బిర్యానీ
    పన్నీర్ దో ప్యాజా
    మునగాకు రసం
    పన్నీర్ అంగా
    రసవాంగి కూటు
    మునగాకు ఫ్రై
    పన్నీర్ బేబీ కార్న్
    కాకరకాయ మసాలా
    స్టఫ్డ్ భేండీ
    వజక్కయ్ కర్రీ
    చేమదుంప మసాలా
    మునగాకు పప్పు
    కొబ్బరి వేపుడు
    పన్నీర్ స్వీట్ కార్న్ మటర్
    మెంతాకు పన్నీర్
    పన్నీర్ మక్‌మలాయ్
    మొఘలాయీ కాలీఫ్లవర్
    పన్నీర్ క్యాప్సికం మసాలా
    కాప్సికం
    శనగపప్పు
    ఉసిరికాయ పప్పు
    బంగాళదుంప - మునగాకు ఫ్రై
    ఉల్లిపొరక కూర
    శెనగపప్పు ఉండల పులుసు
    కాలీఫ్లవర్
    వెల్లుల్లి కారం
    క్యాప్సికం కర్రీ
    చింతచిగురు దొండకాయ
    క్యాప్సికం పన్నీర్ కుర్మా
    బంగాళాదుంపలు
    చిక్కుడుగింజల కూర
    మొక్కజొన్నకుర్మా
    మొక్కజొన్నవేపుడు
    పన్నీర్ 65
    6b605723e1
    6d6af64986
    8c8cfd2e64
    8d0d675c9a
    90a7d6058e
    937f48c38a
    9640acb058
    Edd5508010
    Eeb66b27c8
    F20375deb0
    F4948ccbad
    Fdca5c53e4
    Fe39ccde14
    Fe7fa990a7
    Ff67fc0182
    Fffc315ddf

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.