కాలీఫ్లవర్ : ముప్పావు కిలో
నూనె : 4 టేబుల్ స్పూన్లు
పాలపొడి : 3 టేబుల్ స్పూన్లు
పంచదార : పావు టీస్పూన్
గ్రేవీ ముద్దకోసం :
ఉల్లిపాయలు : రెండు
అల్లం : అర అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు : మూడు
పచ్చిమిర్చి : 5
గరం మసాలా కోసం :
దాల్చిన చెక్క : అర అంగుళం ముక్క
యాలకులు : రెండు
లవంగాలు : రెండు
తయారుచేసే పద్ధతి:
కాలీఫ్లవర్ పూరెమ్మలను దేనికది విడదీయాలి. తరువాత వీటిని ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. ఆలోపు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేయాలి. ముప్పావు కప్పు నీళ్ళల్లో పాలపోడ్ వేసి పేస్ట్ లా చేయాలి. ఆ తర్వాత ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను మూడు నాలుగు నిముషాలు వేయించి తీయాలి. తర్వాత అందులోనే మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద, గరం మసాలా వేసి వేయించాలి. ఇప్పుడు పాలపొడి ముద్ద కూడా వేసి ఉడికించాలి. పాలపొడి ముద్ద పాలవిరుగుడులా అయ్యేవరకూ ఉడికించాలి. ఇప్పుడు వేయించి తీసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి టీకప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరి చూసి సిమ్ లో 5 నిముషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా అయ్యాక ఇష్టం అయితే పంచదార వేసి కలిపి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం