చేమదుంపలు - పావుకిలో
పచ్చిమిర్చి - 1
గరం మసాలా - పావుటీస్పూన్
వాము - అరటీస్పూన్
ఉల్లిపాయ - ఒకటి
కారం - అర టేబుల్ స్పూన్
ఉప్పు - అరటీస్పూన్
నిమ్మరసం - అర టేబుల్ స్పూన్
సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్
నూనె - తగినంత
గ్రేవీ కోసం :
టొమాటోలు - పావుకిలో
అల్లం,వెల్లుల్లి - టీస్పూన్
పచ్చిమిర్చి - ఒకటి
కారం - అరటీస్పూన్
లవంగాలు - 2
యాలకులు - 2
ఉప్పు - రుచికి సరిపడా
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి - టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి :
- ముందుగా చేమదుంపల్ని కుక్కర్ లో వేసి ఓ విజిల్ రానివ్వాలి. తరువాత మంట తగ్గించి రెండు మూడు నిముషాలు ఉడికించి దించాలి.
- గ్రేవీ కోసం ఓ బాణలిలో కొంచెం నూనె వేసి వేడి అయ్యాక టొమాటో ముక్కలు వేసి కప్పు నీళ్ళు పోయాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి,కారం, లవంగాలు, యాలకులు వేసి మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపి పప్పు గుత్తితో మెదిపి తొక్కు తీసేసి నీటిని మాత్రం ఓ పాన్ లోకి వంపి స్టవ్ మీద పెట్టాలి. వెన్న,ఉప్పు వేసి మరో రెండు నిముషాలు మరిగించాలి. కసూరి మెంతి కూడా వేసి దించి ఈ గ్రేవీని ఓ పక్కకు ఉంచుకోవాలి.
- చేమదుంపల పొత్తు తీసి ముక్కలుగా కోయాలి. ముక్కల మీద ఉప్పు, కారం చల్లాలి. తరువాత సెనగ పిండి చల్లి మొత్తం ముక్కలన్నింటికి అతుక్కునేలా వాటిని పైకి కిందికి కలపాలి.
- మరో బాణలిలో నూనె (డీప్ ఫ్రీ కి సరిపడా ) వేసి సగం సగం చొప్పున వేయించి తీయాలి. బాణలిలో కొద్దిగా నూనెను ఉంచి మిగతాది తీసేయాలి. కొద్దిగా నూనె ఉన్న బాణలిలో వాము, ఉల్లి ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వేయించి తీసిన చేమగడ్డల ముక్కలు వేసి, ఉప్పు, కారం సరిచూసి కొత్తిమీర చల్లాలి. గ్రేవీ వేసి మొత్తం ముక్కలకు పట్టేలా కలపాలి. నిమ్మరసం, గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి కలిపి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం