టోఫూ ముక్కలు - 250 గ్రా.
కారం పొడి - 1 టీ.స్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
పంచదార - చిటికెడు
ఉప్పు - తగినంత
మైదా - 1 టీ.స్పూ.
సోయా సాస్ - 1/2 టీస్పూ.
నిమ్మరసం - 1 టీ.స్పూ.
కలర్ - చిటికెడు
కరివేపాకు - 3 రెబ్బలు
నూనె - వేయించడానికి
వండే విధం
- టోఫూని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
- ఆతర్వాత ఒక గినె్నలో మైదా, పంచదార, సోయా సాస్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కలర్ వేసి కలపాలి.
- ఇందులో టోఫూ ముక్కలు వేసి, బాగా కలిపి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
- కరివేపాకు కూడా అదే నూనెలో వేయించుకుని ఈ టోఫూతో పాటు వేడిగా సర్వ్ చేయాలి.