కాలీఫ్లవర్ - ముప్పావు కిలో
నూనె - 4 టేబుల్ స్పూన్లు
పాలపొడి - 3 టేబుల్ స్పూన్లు
పంచదార - పావుటీస్పూన్
గ్రేవీ ముద్దా కోసం :
ఉల్లిపాయలు - 2
అల్లం - అర అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 3
పచ్చిమిర్చి - 5
గరం మసాలా కోసం :
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
యాలకులు - రెండు
లవంగాలు - రెండు
తయారుచేసే పద్ధతి :
- కాలిఫ్లవర్ పూరేమ్మలను దేనికది విడదీయాలి. తరువాత వీటిని ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి.
- ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి.
- ముప్పావు కప్పు నీళ్ళలో పాలపొడి వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
- బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలను వేసి మూడు నాలుగు నిముషాలు వేయించి తీయాలి. తరువాత అందులోనే మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద, గరం మసాలా వేసి వేయించాలి. ఇప్పుడు పాలముద్ద కూడా వేసి ఉడికించాలి. పాలపొడి ముద్ద పాలవిరుగుడులా అయ్యేవరకు ఉడికించాలి.
- ఇప్పుడు వేయించి తీసిన కాలిఫ్లవర్ ముక్కలు వేసి టీ కప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరిచూసి సిమ్ లో 5 నిముషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా అయ్యాక ఇష్టమైతే పంచదార వేసి కలిపి దించుకోవాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం