కాలీఫ్లవర్ - 1,
ఆలుగడ్డలు - 4,
టమాటా - 1,
పసుపు - ఒక టీ స్పూన్,
కారం - అర టీ స్పూన్,
కొత్తిమీర - పావు కట్ట,
ధనియాల పొడి - ఒక టీ స్పూన్,
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
- కాలీఫ్లవర్, ఆలుగడ్డలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- కడాయిలో నూనె పోసి కాలీఫ్లవర్, ఆలుగడ్డలను వేసి వేయించాలి.
- పది నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. మరో ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే.. ఆలూ గోబీ రెడీ!