పన్నీర్ - 50 గ్రా.
బేబీ కార్న్ - 50 గ్రా.
గరం మసాలా - టీస్పూన్
జీడిపప్పు - గార్నిష్ కోసం
ఉల్లితరుగు - పావుకప్పు
టొమాటో తరుగు - పావుకప్పు
పుదీనా - అరకప్పు
తర్బూజ గింజల పేస్ట్ - 20 గ్రా.
అజినమెటో - అరటీస్పూన్
బటర్ - 10 గ్రా.
అల్లం వెల్లుల్ పేస్ట్ - 50 గ్రా.
పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
కారం - 2 టీస్పూన్లు
జీడిపప్పు పొడి - 20 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- పన్నీర్ ను డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. బేబీ కార్న్ ను గుండ్రముగా తరగాలి.
- స్టవ్ మీద బాణలి ఉంచి మూడు టీస్పూన్ల నూనె వేసుకొని, కాగాక ముందుగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలను వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.
- వేరే బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగుని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి. తర్వాత గరం మసాలా, అజినమెటో, ఉప్పు వేసి కలపాలి. తర్వాత జీడిపప్పు పొడి, తర్బూజ గింజల పేస్ట్, కొద్దిగా నీరు, కారం, పసుపు వేసి ఉడుకుతుండగా, ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా కలపాలి.
మూలం : సాక్షి దినపత్రిక