పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్పు
ఉల్లిపాయ - 1 చిన్నది
ఎండుమిర్చి - 6
నూనె - 2 టీ.స్పూ.
ఆవాలు, జీలకర్ర - 1/2 టీ.స్పూ.
మినప్పప్పు - 2 టీ.స్పూ.
కరివేపాకు - 1 రెబ్బ
ఉప్పు - తగినంత
చేసే విధానం
సీమ వంకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. బాణలి లేదా పాన్లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో సీమ వంకాయ ముక్కలువేసి కలిపి మూత పెట్టాలి. కొద్దిగా వేగిన తర్వాత తగినన్ని నీళ్లుపోసి, ఉప్పువేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత పచ్చికొబ్బరి తురుమువేసి కలిపి తడి పూర్తిగా పోయేవరకు వేయించాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది