సొరకాయ - పావుకేజీ
మొక్కజొన్న పిండి - మూడు టేబుల్ స్పూన్లు
బ్రెడ్ స్లైసులు - మూడు
ఉల్లిపాయలు - మూడు
టొమాటోలు - రెండు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఐదారు
జీడిపప్పు - ఎనిమిది
వెన్న - అరకప్పు
పసుపు - అరచెంచ
ఉప్పు - తగినంత
కారం - రెండు చెంచాలు
ధనియాల పొడి - రెండు చెంచాలు
నూనె - వేయించడానికి సరిపడా
జీలకర్ర - కొద్దిగా
కొత్తిమీర తరుగు - పావుకప్పు
తయారుచేసే పద్ధతి :
- సొరకాయ చెక్కు తీసి తురుమి గట్టిగా పిండేస్తే అందులోని నీరు పోతుంది. అందులో మొక్కజొన్న పిండి, బ్రెడ్ పొడి, తగినంత ఉప్పు, చెంచ కారం, సగం కొత్తిమీర తరుగు వేసుకొని గట్టి పిండిలా కలుపుకోవాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని ఉండల్లా చేసుకొని అందులో వేసి ఎర్రగా వేయించుకొని తీసి పెట్టుకోవాలి.
- ఉల్లిపాయ, టొమాటోలను ముక్కల్లా కోసి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఐదారు చెంచాల నూనెలో వేసి బాగా ఉడకనివ్వాలి. కాసేపయ్యాక మిగిలిన కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర తరుగు, మరికొంచెం ఉప్పు, వెన్న వేసి బాగా కలపాలి. ఒకవేళ గ్రేవీ మరీ గట్టిగా ఉందనుకుంటే కాసిని నీళ్ళు కలుపుకోవచ్చు. ఐదారు నిమిషాలయ్యాక దీన్ని దింపేసి ముందుగా వేయించుకున్న ఉండాలని వేస్తే సరిపోతుంది. ఇది ఫ్రైడ్ రైస్ లోకి, రొట్టేల్లోకి బాగుంటుంది.
మూలం : ఈనాడు వసుంధర