గుమ్మడి కాయ ముక్కలు : 3 కప్పులు (చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి)
టమోటా ముక్కలు : 1 కప్పు
ఉల్లిపాయలు : 2 (తరిగి పెట్టుకోవాలి)
బెల్లం కోరు : 1 కప్పు
ఎండు మిరపకాయలు : 2
పచ్చిమిరపకాయలు : తగినన్ని
కారం పొడి : అరచెంచా
ధనియాల పొడి : అరచెంచా
ఆవాలు : అరచెంచా
జీలకర్ర : అరచెంచా
మినపప్పు : అరచెంచా
కొత్తిమీర : కొద్దిగా
కరివేపాకు : కొద్దిగా
తయారుచేసే పద్ధతి :
ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి అయ్యాక కొన్ని ఆవాలు వేసి చిటపటలాడక జీలకర్ర, తుంపిన ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలిపి దోరగా వేయించుకోవాలి. వేగిన ఉల్లిపాయలకు, గుమ్మడి ముక్కలు, టమోటా ముక్కలు, చిటికెడు పసుపు కలపాలి. తగినంత ఉప్పు వేసి పదిహేను నిముషాలు సన్నని సెగపై ఉడకనిచ్చాక కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, బెల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు అరకప్పు నీరు పోసి ముక్కలు ఉడికే అంత వరకు సన్నని సెగపై ఉంచాలి. కూర దించుకున్నాక కొత్తిమీర చల్లి వడ్డించాలి.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ