పన్నీర్-200గ్రా
నూనె-4 చెంచాలు
ఉల్లిపాయలు-3
ఉప్పు-రుచికి తగినంత, కారం-తగినంత
ధనియాలపొడి-ఒక చెంచా
పసుపు-చిటికెడు
టమాట గుజ్జు-పావుకప్పు
క్రీమ్-3 చెంచాలు
కొత్తిమీర-కొంచెం
తయారుచేసే విధానం
- చెంచా నీళ్లలో కారం, ధనియాలపొడి, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
- అవి వేగాక ముందుగా నీళ్లలో కలిపిన మసాలా ముద్దను వేసి కలియతిప్పి పచ్చి వాసన పోయాక టమాట గుజ్జు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మూతపెట్టాలి. పది నిమిషాలయ్యాక పన్నీరు ముక్కలు చేర్చాలి. గ్రేవీలో పన్నీరు ఉడికాక క్రీమ్ వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూరను రోటీలో తింటే రుచిగా ఉంటుంది.