పన్నీర్ - 100 గ్రా.
గరం మసాలా - టీస్పూన్
ఉల్లిపాయలు - 2
టొమాటోలు - 4
క్యాప్సికం ముక్కలు - కొద్దిగా
తర్బూజ గింజలు - 10 గ్రా.
అజినమెటో - అరటీస్పూన్
కొబ్బరి పొడి - 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రా.
పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
కారం - 2 టీస్పూన్లు
జీడిపప్పు పొడి - 10 గ్రా.
మిరియాలు - 10
ఎండు మిర్చి - 10
తయారుచేసే పద్ధతి :
- ముందుగా పన్నీర్, ఉల్లిపాయ, టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి, తర్బూజ గింజలు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి.
- స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
- కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి 5 నిముషాలు ఉడికించాలి.
- ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసి, కొద్దిగా నీరు పోసి రెండు లేక మూడు నిముషాలు ఉడికించి దించే ముందు కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి.
- చివరగా మిరియాలు, ఎండు మిర్చి, పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించి, క్యాప్సికం, టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక